జిల్లా ఎస్పీమీద విరుచుకపడ్డ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

జిల్లా ఎస్పీమీద విరుచుకపడ్డ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
March 07 17:49 2018
నెల్లూరు
నెల్లూరు పోలీస్ ఎస్పీ రామకృష్ణ ను వైసిపి రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ చేసారు. తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని శ్రీధర్రెడ్డి ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ఎస్పీ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల కాల్డేటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు ఉన్నందునే తనను విచారణకు పిలిచారని చెప్పుకొచ్చారు. క్రికెట్ బెట్టింగ్ బుకీలతో సంబంధాలున్న వారిని విచారించడం లేదని ఆరోపించారు. హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను తప్పుచేసినట్టు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా…రాజకీయాలను వదిలేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సవాల్ విసిరారు. ఎస్పీ వేధింపులకు గురై ఓ సిఐ ఆత్మహత్య చేసుకోలేదా అని ప్రశ్నించారు.  ఎస్పీ సస్పెండ్ చేసిన డిఎస్పి, సిఐ లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.  కోవూరు సిఐ ఆకస్మిక మృతి మీద కూడా ఎస్పీ పై ఆరోపణలు వచ్చిన సంగతి అయన గుర్తు చేసారు.  జిల్లా ఎస్పీ రామకృష్ణ ఒక సైకో..  ఐపీఎస్ ప్రతిష్టను ఎస్పీ రామకృష్ణ దిగజారుస్తున్నారని విమర్శించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19269
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author