కాంగ్రెస్ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ షో 

కాంగ్రెస్ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ షో 
March 07 18:18 2018
నిర్మల్,
 నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ షో అని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎవరెన్ని యాత్రలు చేసినా… 2019 లో టీఆర్ఎస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంస్కారం లేకుండా… మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని, నీచమైన రాజకీయాలు చేస్తురన్నారు. ఇన్నేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమి లేదని వెల్లడించారు.  నిర్మల్ జిల్లా ప్రజా చైతన్య బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిప్పి కొట్టారు.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు పట్టుమని పది వేల మంది కూడా రాలేదన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పై  సీఎం ప్రకటన హర్షనీయం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పై సీయం కేసీఆర్ర్ ప్రకటన చేయడం పట్ల గృహ నిర్మాణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీయం కేసీఆర్ కు దేశ వ్యాప్త మద్దతు లభిస్తుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత ఒక్క సీటు కూడా తమకు రాదనే ఆందోళనలో కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని ఎవరు అడ్డుకోలేరని    స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీదే అప్రహతీత విజయమని సర్వేలు కూడా చెప్పుతున్నాయన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19280
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author