సిటీలో నయా స్టడీ హాల్స్

సిటీలో నయా స్టడీ హాల్స్
March 07 22:04 2018
హైద్రాబాద్,
ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావాలనుకునే వారికి ఇప్పటి వరకు ప్రభుత్వ లైబ్రరీలు, యూనివర్శిటీ, కళాశాల ల ప్రాంగణాలు, కాసింత ఖర్చు పెట్టుకునే స్తోమత ఉన్న వారికి ప్రైవేటు కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మారిన పరిస్థితులు, వరుసగా వస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్‌ల నేపథ్యంలో నిరుద్యోగులు ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి నగరంలో కొత్తగా స్టడీ హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో, ప్రశాంత వాతావరణంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అనువైన ప్రైవేటు స్డడీ హాల్స్ నగరంలోని కీలక ప్రాంతాల్లో చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ లైబ్రరీలకు వచ్చి పోటీ పరీక్షల కోసం చదువుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వస్తున్న ప్రైవేటు స్టడీ హాల్స్ ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. చిక్కడపల్లి ప్రాంతం లో ఇటీవల పదుల సంఖ్యలో ఏర్పాటు చేసిన ప్రైవేటు స్డడీ హాల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో కలకలలాడుతున్నాయి. స్టడీ హాల్స్ నిర్వాహకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రశాంతం వాతావరణాన్ని కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. విశాలమైన భవనాలు, హాల్స్‌లో ప్రత్యేక క్యాబిన్‌లు, అనువైన కుర్చీలు, టేబుళ్లు, ప్యాడ్‌లు, లైటింగ్, ఏసీ, మినరల్ వాటర్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సాధారణ స్టడీ హాల్ అయితే నెలకు రూ.800 నుంచి వెయ్యి, ఏసీ హాల్స్ రూ.900 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని స్టడీ హాల్స్‌లు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుండగా… మరికొన్ని స్టడీ హాల్స్ 24 గంటలు తెరిచే ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రూప్-1,2, వీఆర్‌ఓ, ఎస్‌ఐ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్‌సీ, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్స్ తదితర ఉద్యోగ పరీక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగులు స్టడీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎవరీ పుస్తకాలు, ప్రిపరేషన్ సామగ్రి వారివెంట తెచ్చుకొని గంటలకొద్ది పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగ నియామక ప్రకటనలు క్రమంగా వస్తుండటంతో స్టడీహాల్స్‌కు డిమాండ్ పెరిగిందని గాంధీనగర్ అచీవర్స్ స్టడీ హాల్ నిర్వాహకులు చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19308
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author