పార్లమెంట్‌ ఆవరణలో మీసం మెలేస్తూ..తొడ కొట్టిన జేసీ

పార్లమెంట్‌ ఆవరణలో మీసం మెలేస్తూ..తొడ కొట్టిన జేసీ
March 08 19:13 2018
న్యూదిల్లీ
పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఎంపీలు గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తుండగా తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అక్కడకు వెళ్లారు. ప్రత్యేక హోదా కోసం తామంతా రాజీనామాకు సిద్ధమని, దమ్ముంటే రాజీనామా చేసి రాష్ట్రం కోసం పోరాడాలని వారికి సవాల్‌ విసిరారు. దీనిని ప్రతిఘటిస్తూ వైకాపా ఎంపీలు కూడా రాజీనామా చేస్తామని ప్రతిసవాల్‌ విసిరారు. ఈ క్రమంలో జేసీ మీసం మెలేస్తూ.. తొడకొట్టారు. ఈ తతంగాన్నంతా అక్కడి మీడియా కెమెరాల్లో బంధించింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19391
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author