కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా

కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా
March 08 19:17 2018
న్యూ ఢిల్లీ
కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు,సుజనా చౌదరి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతం లో  ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. కాగా పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ఉన్న విషయం తెలిసిందే. 2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతి, నవంబర్ 9న సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగబోతున్న తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి కాగా ఈ ఇద్దరూ మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో బయల్దేరారు. అశోక్ గజపతి రాజు సాయంత్రం 5.15 గంటలకు సుజనా చౌదరి నివాసానికి వెళ్ళారు. రాజీనామాల విషయంలో వెనుకకు తగ్గేది లేదని అశోక్ గజపతి రాజు చెప్పారు. ఇదిలావుండగా ప్రధాని మోదీ,  చంద్రబాబు ఫోన్‌లో దాదాపు 10నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం.కాగా ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మంత్రులు కామినేని  ణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను అందజేశారు. మంత్రులుగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కామినేని, మాణిక్యాలరావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులుగా ఎంతో బాధ్యతగా వ్యవహరించారని, విలువలకు కట్టుబడి పనిచేశారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారిని కొనియాడారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఈ ఉదయం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ప్రధాని  నుంచి రిప్లై రాలేదు అందుకే మేం మా నిర్ణయం తీసుకున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంలో తిరుగుండదని మంత్రి కాల్వ స్పష్టం చేసారు. మిత్ర ధర్మంగా బుధవారం రోజు ప్రధాని మోదీకి మా నిర్ణయాన్ని చెప్పేందుకు ప్రయత్నించాం. అయితే ఆ సమయంలో మోదీ అందుబాటులోకి రాలేదు. మా మంత్రులు రాజీనామా చేస్తారని ముందస్తు సమాచారం ఇవ్వడానికి సీఎం బాబు ఫ్రయత్నించారు. కానీ అప్పటికే చాలా లేట్‌గా కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసి ప్రధాని బహుశా ఇంటికి వెళ్లివుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తిరుగుండదు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం కోరుకుంటున్నాం” అని కాల్వ శ్రీనివాస్ స్పష్టం చేశారు.కాగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రాజీనామాకు సిద్ధమైన సుజనాచౌదరి కటౌట్‌కు తిరుపతిలోని మునిసిపల్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పదవుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాజీనామాలు చేసిన కేంద్ర మంత్రులకు అనుకూలంగా నినాదాలు చేశారు. జై తెలుగు దేశం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని కార్యకర్తలు చెప్పారు. ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని, అండగా ఉంటామని ప్రధాని మోదీ తిరుపతిలో వాగ్ధానం చేశారని, దాంతో తెలుగు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. ఏదో చేస్తారని అనుకుంటే.. మోదీ అమరావతికి వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు, కొంత మట్టి తీసుకువచ్చారని… అప్పుడు చంద్రబాబు ఓపిగ్గా ఉన్నారని, ఆఖరి బడ్జెట్‌లో కూడా ఏపీకి న్యాయం జరగలేదన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19394
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author