స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ గోల

స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ గోల
March 09 10:41 2018
 మంచిర్యాల,
భావిభారత పౌరులు రూపొందేది తరగతి గదుల్లోనే! అలాంటి క్లాస్‌రూం వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే బోధనాభ్యసన ప్రక్రియ అంతా సాఫీగా సాగుతుంది. కానీ ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాజాగా పాఠశాల విద్యాశాఖ రంగంలోకి దిగింది.
స్మార్ట్ ఫోన్ల రంగప్రవేశం తర్వాత చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. విద్యా ర్థులకు పాఠాలు చెప్పడం కన్నా ఫోన్లలో మాట్లాడడం, ఆనలైన చాటింగ్‌, సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉం టున్నారనీ, తద్వారా విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 6న ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్‌ ఫోన్లను తీసుకెళ్లకుండా చూడాలని విద్యాశాఖ సంచాలకులు కిషన అన్ని జిల్లాల విద్యాధికారులకు ఉత్తర్వులు(నెం. 3466) జారీ చేశారు. తొలుత కస్తూర్బా గాంధీ విద్యాల యాల్లో, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ ప్రా థమిక, ఉన్నత పాఠశాలల్లో విధిగా అమలుచేయాలని ఆ దేశించారు. కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్లు, టీచింగ్‌, నాన టీ చింగ్‌ సిబ్బంది ఎవరూ కూడా తరగతి గదుల్లోనూ, పా ఠశాల ఆవరణలోనూ సెల్‌ఫోన వినియోగించరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేజీబీవీల్లో టీచింగ్‌, నాన టీచింగ్‌ సిబ్బంది వారి సెల్‌ ఫోన్లను స్పెషల్‌ ఆఫీసర్ల వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉం టుంది. తరగతి గదుల సమయం ముగిసిన తర్వాత తిరిగి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులు కూడా సెల్‌ఫోన వాడవద్దు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో స్పెషల్‌ ఆఫీసర్‌ ఫోన్ మాట్లాడవచ్చు. ఈ విష యాన్ని కూడా రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. వాటి అమలు పర్యవేక్షణ, బాధ్యతలను డీఈఓలకు అప్పగించారు. జిల్లాలో 18 కస్తూర్బాగాంధీ విద్యాల యాల్లో సుమారు 3వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి కేజీబీవీలోనూ సుమారు 20 మంది వరకు ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారు. వీరందరికీ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
ఈ విద్యాసంవత్సర ప్రారంభం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధం అమలు చేయనున్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో 3వేల ప్రభు త్వ పాఠశాలలు ఉండగా, అన్నిచోట్లా ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు కసరత్తు జరుగుతోంది. కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల మాదిరిగానే ఇక్కడ పాఠశాలల ప్రధానోపాద్యాయుల వద్ద ఉపాధ్యా యులు తమ సెల్‌ఫోన్లను డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. తరగతులు పూర్తయ్యాకే వాటిని అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నా రు. మధ్యాహ్న భోజన వివరాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిత్యం పై అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల వారికి ఆ సమయంలో మినహాయిం పు ఇస్తారు. పాఠశాలల్లో సెల్‌ఫోన్లపై నిషేధంతో సత్ఫలితా లుంటాయని విద్యాధికారులు భావి స్తున్నారు. కాగా, ప్రస్తుత సాంకేతిక యుగం లో తమ అనుమానాలను నివృత్తి చేసుకు నేందుకు, విద్యార్థులకు మరింత వివరం గా బోధించేందుకు స్మార్ట్‌ఫోన్లు పనికివ స్తున్నాయనీ, అందువల్ల వాటిపై నిషే ధం సరికాదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19406
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author