రోడ్డును మూసేశారు…

రోడ్డును మూసేశారు…
March 09 10:55 2018
విజయనగరం,
‘ఈ రహదారిని మాకోసమే వేశారు. మేమే రాకపోకలు సాగించాలి. వేరే కాలనీకి చెందినవారు నడవడానికి వీల్లేదు’. రోజూ కాలినడకన రాకపోకలు సాగించే వేరే కాలనీవాసులు అటువైపు రాకుండా రహదారిని మూసేశారు. ఏంటి ధారుణమని చూసేవారు ముక్కున వేలేసుకుంటున్నారు. మూడోవార్డు పరిధి బిఎన్‌ఆర్‌ నగర్‌ వాసులు తోటగరువు కూడలికి చేరుకునేందుకు ఉన్న ఓవైపు చిన్నదారిని మూసేశారు. బిఎన్‌ఆర్‌నగర్‌ వాసులకోసం గెడ్డపై నిర్మిస్తున్న వంతెన నిర్మించడం పక్కనే ఉన్న తోటగరువు స్థానికులు వ్యతిరికిస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితమే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. మొదటి నుండి తోటగరువు స్థానికులు వంతెన నిర్మాణానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇటీవలె వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు. నిర్మాణ పనులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం తోటగరువు కూడలికి చేరుకునేందుకు రెండోవైపు ఉన్న చిన్న పాటి రహదారిలో నడవకుండా అడ్డుగా కర్రలతో కట్టేసి రహదారిని మూసివేశారు. రోజూ అటువైపు గుండా వెళ్ళే పాదచారులు, విద్యార్థులు వేరే రహదారి గుండా రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ప్రభుత్వం వేసే రహదారి గుండా నడవడానికి ఏంటీ ఈ అడ్డంకులని బిఎన్‌ఆర్‌నగర్‌ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలుగ చేసుకొని అడ్డకులు తొలిగించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.పాఠశాలకు దగ్గరని ఈ దారి గుండా చాలాకాలంగా వెళ్లి వస్తున్నాం. ఇపుడు అర్థాంతరంగా రహదారిని మూసేయడంతో పాఠశాలకు వేరే మార్గంలో చుట్టూ తిరిగి వెళుతున్నాం చాలాకష్టంగా ఉంది.కొన్నేళ్ళుగా ఈ మార్గం గుండానే కాలినడకన రాకపోకలు సాగిస్తున్నాం. రాత్రికి రాత్రే రహదారిని మూసేశారు. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అందరికి సంబంధించిన రోడ్డులో ఇటువంటి అడ్డులు వేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19414
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author