రెడీ అవుతున్న కొత్త ఓటర్ల జాబితాలు

రెడీ అవుతున్న కొత్త ఓటర్ల జాబితాలు
March 09 12:46 2018
కాకినాడ,
ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితాల సవరణ-2018 ప్రక్రియలో భాగంగా మాన్యువల్, ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులన్నీ పరిష్కరించి షెడ్యూల్ ప్రకారం తుది జాబితా ప్రచురణకు ఓటరు డేటాను నవీకరిస్తున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితాల సవరణ 2018 కార్యక్రమ పురోగతి, బడ్జెట్ నిధుల వినియోగం, అదనపు అవసరాలు, వివిపాట్ యంత్రాల కోసం గొడౌన్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఓటరు జాబితాల సవరణ-2018 ప్రక్రియపై అందిన క్లైయిమ్‌లు, అభ్యంతరాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కరించి వాటిని ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ సవరణ కింద జిల్లాలో 1, 05, 836 క్లైయిమ్‌లు, అభ్యంతరాల దరఖాస్తులు అందాయన్నారు. వీటిలో 99, 320 దరఖాస్తులను ఆమోదించి 6247 తిరస్కరించగా కేవలం మరో 114 దరఖాస్తులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయన్నారు. పరిష్కరించిన క్లైయిమ్‌లు, అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి ఓటర్ల సమాచారాన్ని నవీకరిస్తున్నామని చెప్పారు. ఎన్నికల బడ్జెట్ కింద జిల్లాకు 30 లక్షల 45 వేల మేరకు విడుదల కాగా ఇందులో 23 లక్షల 15 వేలు డ్రా చేసి చెల్లించామని, మరో 7 లక్షల 45 వేల మేరకు బిల్లులు ట్రజరీకి సమర్పించామన్నారు. వివిపాట్ యంత్రాల గొడౌన్ నిర్మాణానికి జిల్లాకు 90 లక్షల నిధులు విడుదల చేశామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో కొత్తగా చేరిన విలీన మండలాల ఓటర్లను జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజక వర్గాలలో చేర్చే అంశంపై స్పష్టమైన ఆదేశాలు లేవని, ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆయన సిఇఓను కోరారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19424
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author