ఏప్రిల్ 8న గురుకులాలకు ఎంట్రన్స్ టెస్ట్

ఏప్రిల్ 8న గురుకులాలకు ఎంట్రన్స్ టెస్ట్
March 09 13:37 2018
నిజామాబాద్
కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలతో ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 30 గురుకుల పాఠశాలల్లో 2,400 మంది ఆడ్మిషన్లకోసం పరీక్ష నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు క్రీడలతో పాటు ఉన్నత చదువుల విషయంలోనూ తమ సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.రాష్ట్రంలో ఐదు శాఖల ఆధ్వర్యంలో బాలికల, బాలుర గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. సాంఘిక సంక్షేమ గిరిజన (ఎస్సీ), గిరిజన సంక్షేమ (ఎస్టీ), మహాత్మాజ్యోతిబా ఫూలే (బీసీ), మైనార్టీ సంక్షేమ, జనరల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం గురుకులాల ద్వారా అందిస్తున్నది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాధిస్తున్న విజయాలు దేశంలోనే ఆదర్శంంగా నిలుస్తున్నాయి. గతేడాది వరకు ఏశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు అదేశాఖ ద్వారా దరఖాస్తులు స్వీకరంచి పోటీ పరీక్షతో సీట్లను కేటాయించేవారు.  రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీలో భాగంగా ఉమ్మడి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతి నుంచి 10 తరగతితో పాటు ఇంటర్, డిగ్రీ వివిధ కోర్సుల్లో ఉచిత విద్య, భోజనవసతి కల్పించడంతోపాటు కనీస సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. జిల్లాలో 16 ఎస్సీ (బాలికలు -8, బాలురు-8), 1 ఎస్టీ (బాలికలు), 6 మైనార్టీ ( బాలికలు-3, బాలురు-3), 6 బీసీ (బాలికలు-1, బాలురు-5), జనరల్ 1 బాలికల గురుకుల పాఠశాల ఉన్నా యి. ఒక్క పాఠశాలలో రెండు సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్‌కు 40 మంది చొప్పున ఒక్క పాఠశాలకు 80 మంది విద్యార్థులను రిజర్వేషన్ల ప్రతిపాదికన ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌లో నిర్వహించే ఈపోటీ పరీక్షకు ప్రభు త్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నవారు బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2005 సెప్టెంబర్ 1నుంచి 2009 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. బీసీ, ఓసీ విద్యార్థులు 2007 సెప్టెంబర్ 1 నుంచి 2009 ఆగస్టు 31లోగా జన్మించిన వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ వాసులైతే రూ.2 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉండరాదు. పరీక్ష ఫీజు రూ.50 చెల్లించి tgset. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 16 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాత పరీక్ష ఉం టుంది. వంద మార్కుల పేపర్ అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. విభాగాల వారీగా తెలుగు 20, ఇంగ్లిష్ 25, గణితం 25, పరిసరాల విజ్ఞానం 25, మెంటల్ ఎబిలిటీ 5చొప్పున ప్రశ్న లు ఉంటాయి. విద్యార్థులు ఓఎంఆర్ సమాధాన పత్రంపై సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19446
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author