పుట్టుక..చావు  టీఆర్ఎస్ లోనే :మంత్రి హరీష్ రావు  

పుట్టుక..చావు  టీఆర్ఎస్ లోనే :మంత్రి హరీష్ రావు  
March 09 17:42 2018
హైదరాబాద్,
రాజకీయ లబ్ధికోసమే నా మీద దుష్ప్రచారం చేస్తున్నరని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  కలలో కూడా ఇలాంటి ఆలోచన గాని ఊహ కూడా ఉహించడానికి అవకాశం ఉండదు హరీష్ రావు విషయంలో అని అయన అన్నారు. మేము ఉద్యమాల నుంచి వచ్చినవాళ్ళం..త్యాగాల నుంచి వచ్చినవాళ్ళం…గడ్డిపోచల్లగా కేసీఆర్ గారి మాట మీద రాజీనామాలు చేసినవాళ్ళమని గుర్తు చేసారు. మంత్రి పదవులను రాజీనామా చేసినం…రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా జేసినం…జైళ్లలో పోయినటువంటి వాళ్ళమన్నారు. త్యాగాలు తెలుసు తప్ప…ద్రోహాలు తెలిసిన పార్టీ కాదు…కుటుంబం కాదు మాదని అన్నారు. అటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు..విరమించుకోవాలి…ఇక ముందు పిచ్చి ప్రేలాపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో మీరు చట్ట పరమైన చర్యల కు సిద్ద పడాలని హెచ్చరించారు. నాలికకు నరం లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. తెరాస ప్రభుత్వం లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 2009 మేనిఫెస్టి లో పెట్టినా వాటిని ఒక్కటి అమలు చేశారా….మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా నమ్మలని నిలదీసారు. మేము అధికారం లోకి వస్తే 9 గంటల కరెంట్ ఇస్తా అన్నారు…ఇచ్చారా….?? 24 గంటల కరెంట్ ఇచ్చింది తెరాస ప్రభుత్వమని అన్నారు. 6 కిలోల బియ్యం ఇస్తుంది ఇస్తుంది తెరాస.  చెరువులు పునరుద్ధరించం…రైతులకు నీళ్లు ఇస్తున్నాం..మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికీ నీళ్లు అందరికి అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీక్ ఆడపిల్లల అమ్మకాలు జరిగావి.. అని రోజు చూసే వాళ్ళం. నకలి విత్తనాలు, పేకాట, గుడుంబా లేకుండా చేసాం. ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంతృప్తి గా ఉన్నారు. ప్రెస్ట్రేషన్ తో ప్రజల స్పందన లేక అర్థ రహితంగా మాట్లాడుతున్నారని అయనవిమర్శించారు. బస్ యాత్ర చేసినా ,మోకాళ్ళ పాదయాత్ర చేసినా వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం వస్తుంది..కాంగ్రెస్ ప్రతి పక్షంలో ఉండదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19483
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author