బీజేపీ, టీడీపీల గుర్తుంపు రద్దు చేయాలి

బీజేపీ, టీడీపీల గుర్తుంపు రద్దు చేయాలి
March 09 17:50 2018
న్యూఢిల్లీ,
ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందంటూ ఎన్నికల కమిషన్కు ఏపీ కాంగ్రెస్ శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. బీజేపీ, టీడీపీ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని రఘువీరా రెడ్డి, కేవీపీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఎన్నికల కమిషన్ ను  కోరారు. రెండేళ్లు జైలు శిక్షపడ్డ చింతమనేని ప్రభాకర్ సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. మంత్రిపదవులకు రాజీనామాలు చేయడం టీడీపీ రాజకీయ డ్రామాలో భాగమన్నారు కేవీపీ. ఇంకా ఎన్డీఏలోనే టీడీపీ ఉందని… ఎప్పుడు కావాలంటే మళ్లీ అప్పుడు మంత్రివర్గంలో చేరుతుందని చెప్పారు.
అనంతరం ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలన్న వారు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ … ఏపీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.  15 ఏళ్లవరకు స్పెషల్ స్టేటస్ అని డిమాండ్ చేసినవారు ఒక్క ఏడాదికూడా ఇవ్వకుండా ఏపీ ప్రజలను అవమానించారు. వెంటనే రెండు పార్టీల గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేసారు.మోసపూరిత హామీలిస్తే పార్టీ గుర్తింపును రద్దుచేయాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది. చింతమనేని ప్రభాకర్ సభ్యత్వాన్ని రద్దుచేయాలి. ఆయనకు రెండేళ్లకు పైగా జైలు శిక్షపడింది. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
ఎంపీ కేవీపీ మాట్లాడుతూ రాజీనామా డ్రామాలు ఇవాళ కొత్తకాదు. టీడీపీ – బీజేపీ ఎప్పుడు హత్తుకుంటాయో  ఎప్పుడు విడిపోతాయో,  ఎప్పుడు ఎవరి ప్రయోజనాలకోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాయో చెప్పలేం. అవి వారికే తెలుసు. సామాన్యులకు అర్థం కాదని అన్నారు. రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయి. కానీ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదానిపై మాత్రం బీజేపీ, టీడీపీ గతంలో అంగీకరించాయి. హోదాను ప్యాకేజ్ కోసం  చంద్రబాబు అమ్ముకున్నారు.   మోదీకి నైతిక విలువలుంటే,  వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా ఇచ్చిన హామీలను  నెరవేర్చాలని అయన డిమాండ్ చేసారు.  హామీని మోదీ పాతిపెడితే, చంద్రబాబు కిమ్మనలేదు. కాంగ్రెస్ మాత్రమే అన్నిరకాల పోరాటాలు చేస్తోంది. కనీసం ప్రశ్నించకుండా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చప్పరించుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో నిధులు తమ ఆధీనంలో ఉంటే చాలనుకున్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చిన నిధులను సొంతానికి అనుభవిస్తామనుకున్నారు. తనకు ముట్టాల్సింది ముట్టకపోవడంతో టీడీపీ ఇప్పుడు రాజీనామా డ్రామాలాడుతోందని అన్నారు.  కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ల విషయంలో తేడాలు రావడంతోనే ఇప్పుడు పోరాటం అంటున్నారు. విజయవాడ నుంచి   రాహుల్  ర్యాలీ నిర్వహిస్తే… కాన్వాయ్ కు నల్లజెండాలు చూపించేలా, కోడిగుడ్లు విరిరేలా టీటీపీ చేసింది.   స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామాలు చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారు. మళ్లీ ప్యాకేజ్ ప్రకటిస్తే  నిధులకు లెక్కలడకగపోతే చాలు మళ్లీ కేంద్రంలో టీడీపీ ప్రవేశిస్తుంది. కేంద్రం నుంచి బయటకొచ్చాం తప్ప ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని వారే చెప్పారు.  మళ్లీ చేరడానికి మార్గాలను తెరిచిపెట్టుకునే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీ, టీడీపీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ మూడేళ్ల క్రితమే స్టేటస్ కోసం పోరాటం చేసిందని కేవీపీ గుర్తు చేసారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19489
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author