శ్రీదేవి మరణంపై ఎలాంటి సందేహాలు లేవు

 శ్రీదేవి మరణంపై ఎలాంటి సందేహాలు లేవు
March 09 17:53 2018
న్యూఢిల్లీ
 నటి శ్రీదేవి మరణంపై ఎలాంటి సందేహాలు లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. యూఏఈ ప్రభుత్వం విచారణ పత్రాలు అన్నీ తమకు అందాయని చెప్పారు. ఆ విచారణ నివేదిక ప్రకారమే ఆమె మృతదేహం ఇండియాకు వచ్చింది. ఒకవేళ ఆమె మృతి అనుమానాస్పదంగా ఉంటే ఇప్పటివరకు ఆ కారణమేంటో బయటకు వచ్చేది కదా అని ఆయన అన్నారు. దుబాయ్ హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించినట్లు యూఏఈ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఆమె ఫిబ్రవరి 24 న చనిపోయినా.. ఫిబ్రవరి 27నగానీ ఆమె మృతదేహం ఇండియాకు రాలేదు. దుబాయ్ అధికారులు ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి ప్రమాదవశాత్తూ జరిగిందేనని నిర్ధారించుకున్న తర్వాతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిబ్రవరి 28న ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరపగా.. ఈ మధ్యే ఆమె అస్తికలను హరిద్వార్‌లో నిమజ్జనం చేసిన విషయం తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19491
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author