బెజవాడలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు

బెజవాడలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు
March 10 10:45 2018
విజయవాడ,
విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి… వారం క్రితం, ఇలాగే పోస్టర్స్ వేస్తే, అప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు నానా హంగామా చేసారు… టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే టిడిపి అంతు చూస్తాం అంటూ బెదిరించారు… అయితే, టీవీల్లో ఈ పోస్టర్స్ వేసే నానా హంగామా సృష్టించటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంటనే ఆ పోస్టర్స్ తీసెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు… అయితే, ఇప్పుడు తాజాగా, తెలుగుదేశం మంత్రులు, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన నేపధ్యంలో మరోసారి, కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు..‘కాంగ్రెస్ తల్లిని చంపింది.. బీజేపీ బిడ్డ గొంతు నులుముతోంది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారు’ అంటూ పోస్టర్లు వెలిశాయి… బెజవాడలో వెలసిన హోర్డింగ్‌లపై బీజేపీ నేతలు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఇలాంటివి వేస్తే సహించేది లేదు అంటున్నారు… చెప్పిన దాని కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువే చేసామని, కావాలని బీజేపీని రాష్ట్రంలో నష్ట పరుస్తున్నారని, చెప్తున్నారు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్టర్లు మరో మారు చర్చనీయాంశమయ్యాయి…పోయిన వారం ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లో ఇలా ఉంది… “ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు వేసి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా అన్యాయంగా విభజించారని మీరు ఉద్వేగంతో మొన్న లోక్ సభలో చెప్పారు. దానికి మా కృతజ్ఞతలు.. మీరు ఈ రోజు బీజేపీ పాలనలో టీడీపీ తలుపులు బార్లా తెరిచి , విభజన హామీలను తుంగలో తుక్కుతున్నారు. దీంతో మా తెలుగు ప్రజలు భావోద్వేగంతో అందోళన చెందుతున్నారు. వాడవాడలా ఆవేదనతో గగ్గొలు పెడుతున్నారు. ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి లేకుంటే జాతి మిమ్మల్ని క్షమించదు” అంటూ కాట్రగడ్డ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19528
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author