జోరు పెంచుతున్న జనసేన

జోరు పెంచుతున్న జనసేన
March 10 12:00 2018

హైద్రాబాద్
జనసేన స్పీడ్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులకోసం ఆ పార్టీ వెతుకులాట మొదలుపెట్టింది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని అభ్యర్థులు ఎవరెవరు వున్నారు అనే అంశంపై క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అయిన రాఘవయ్యను ఆ పనికి పురమాయించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఇప్పటికే రెండు మూడు దఫాలు గోదావరి జిల్లాలలోని పలు నియోజకవర్గాలు చుట్టి వచ్చారు. అసలు ఆశావహులు ఎవరు ఎవరు ఉన్నారు. రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనే వారు ఎవరెవరు ఉన్నారు అన్న అంశాలను సేకరించి రాఘవయ్య పవన్ కి వివరించనున్నట్లు తెలుస్తుంది.జనసేన గుంటూరు లో తలపెట్టిన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాల్లో భాగంగా రాఘవయ్య తాజాగా పర్యటిస్తున్నారు. ఆ పర్యటన పేరు పైకి ప్లీనరీ ఏర్పాట్లకే అయినప్పటికీ ఆయన ప్రధాన ఉద్దేశ్యం మాత్రం అభ్యర్థుల వేటే అని పొలిటికల్ సర్కిల్స్ టాక్. రాజమండ్రిలో తాజాగా జరిగిన రాఘవయ్య పర్యటనలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ ను ఆయన ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ నుంచి రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు శ్రీఘాకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి రహస్య మంతనాలు సాగించారు. ఇలా ముఖ్యమైన నాయకులను కలుస్తూ రాఘవయ్య పర్యటనను రాజకీయ వర్గాలు నిశీతంగా పరిశీలిస్తున్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19541
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author