శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్స ఆహ్వాన పత్రిక

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్స ఆహ్వాన పత్రిక
March 10 17:13 2018

హైదరాబాద్,
దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్కరించారు. మిథిల ప్రాంగంణంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.కళ్యాణ శోభ ఉట్టిపడేలా మండపాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. స్వామి వారి కళ్యాణానికి అందరు అహ్వానితులేనని ఆహ్వానం పలికారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19583
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author