11న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడ‌త ప‌ల్స్ పోలియో

11న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడ‌త ప‌ల్స్ పోలియో
March 11 12:41 2018

హైద‌రాబాద్,
పోలియో ర‌హిత స‌మాజ సుస్థిర‌త‌కు ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. వివిధ శాఖ‌ల అధికారులు, ఉద్యోగులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగస్వామ్యంతో ఈ నెల 11వ తేదీన (ఆదివారం) రెండో విడ‌త ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి 5 ఏళ్ల లోపు చిన్నారికి పోలియో చుక్క‌లు ప‌డే విధంగా చేసి ఈ కార్యాక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. పోలియో చుక్క‌లు 11వ తేదీ ప‌డ‌ని పిల్ల‌ల కోసం త‌రువాత వ‌రుస‌గా రెండు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్క‌ల‌ను వేస్తారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 36,55,204 మంది పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌ల‌ను వేయాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించిదన్నారు. 22,768 పోలియో కేంద్రాల ద్వారా 95,500 సిబ్బంది పోలియో చుక్క‌ల‌ను వేయ‌డానికి ప‌ని చేయ‌నున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌యాణాల్లో ఉన్న వారి కోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బ‌స్టాండ్ల‌లో, రైల్వే స్టేష‌న్‌ల‌లో మ‌రియు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాట్లు చేయ‌డ‌మైన‌దన్నారు. 787 మొబైల్ టీం, 2,280 రూట్ సూప‌ర్‌వైజ‌ర్స్‌, 8,711 మంది ఎఎన్ ఎంలు, 27,045 ఆశా వ‌ర్క‌ర్లు, 32,082 అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు ప‌నిచేస్తున్నార‌ని మంత్రి వివ‌రించారు.
గ‌డిచిన ఏడేళ్ళ‌ల్లో మ‌న దేశం, రాష్ట్రంలో పోలియో పొడ‌చూప‌లేద‌న్నారు. అయితే, మ‌న దేశానికి పొరుగున ఉన్న పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, నైజీరియా లాంటి దేశాల పోలియో కేసులు న‌మోదైనందున మ‌నం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైనామ‌ని మంత్రి చెప్పారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 28వ తేదీన నిర్వ‌హించిన మొద‌టి విడ‌త ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం వంద‌కు వంద శాతం విజ‌య‌వంత‌మైంద‌ని మంత్రి అన్నారు. అదే త‌ర‌హాలో ఈ సారి కూడా ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేటివ్‌, స్కూల్ ఎడ్యుకేష‌న్‌, పంచాయ‌తీ రాజ్‌, ఐకేపీ, డిఫెన్స్‌, నేవీ, ఆర్టీసీ శాఖల స‌మ‌న్వ‌యంతో పోలియో చుక్క‌ల కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు.
తాను మెహ‌దీప‌ట్నం ప‌క్క‌న గ‌ల‌ అఫ్జ‌ల్ సాగ‌ర్ యుపిహెచ్‌సిలో పిల్ల‌ల‌కు పోలియో చుక్కులు వేసి ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. మిగ‌తా అన్ని చోట్లా మంత్రులు, క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారులు ఈ పోలియో కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని మంత్రి చెప్పారు.పోలియో చుక్క‌ల కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌సార సాధ్య‌మాలు, ప‌త్రిక‌లు, మీడియా విస్త‌`త ప్ర‌చారం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 0 నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌ల‌ను సిబ్బంది వేస్తార‌ని దీనిని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19622
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author