ఈటల పై విమర్శలకు కట్టుబడి వున్నా :రేవంత్ రెడ్డి

ఈటల పై విమర్శలకు కట్టుబడి వున్నా :రేవంత్ రెడ్డి
March 11 12:48 2018

హైదరాబాద్,
మంత్రి ఈటెల పై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం అయనమాట్లాడుతూ విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తామన్నారు. నేను చేసిన అవినీతి ఆరోపణల పై వివరణ ఇవ్వకుండా మమ్మల్ని తిడుతున్నారు. ఈటెల అయినా సరే మరేమంత్రి చర్చకు వచ్చినా నేను రెడీ అని అన్నారు. ప్రభుత్వం తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తారని ఆశించాం. నిజాయితీ ఉంటె ఈటెల ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాత జిల్లా ల పేరుతో గుంటూరు వ్యక్తికి రేషన్ కార్డ్ ప్రింటింగ్ ఇచ్చి ఈటెల కోట్ల దండుకున్నది నిజమని అన్నారు. కేసీఆర్, హరీష్ లు ..అల్లుడు ఆణిముత్యం ..మామ కేసీఆర్ స్వాతి ముత్యం ల మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు ఫిరాయింపు రాజకీయాలతో బ్రష్టు రాజకీయాలు చేసింది కేసీఆర్ హరీష్ లని విమర్శించారు. తెరాస లో ఉంటె హరీష్ రాజకీయంగా చావడం ఖాయం. కెసిఆర్ కేటీఆర్ లు ఆయనను రాజకీయంగా చంపడం ఖాయమని అయన అన్నారు. కేసుల భయమో, రాజకీయంగా బతకాలనో హరీష్ అమితాషా ను కలిసింది నిజం కాదా అని అడిగారు. ఈటెలను ఎల్పీ లీడర్ చేసినందుకు గతంలో హరీష్ ది కేసీఆర్ పై తిరుగుబాటు ప్రయత్నం చరిత్ర అని అన్నారు. గతంలో వైఎస్ ను హరీష్ కలిసి కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అని చెప్పింది నిజం కాదా ..? టీఆరెస్ ను పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హరీష్ ఓప్పందం చేసుకున్నది వాస్తసవమన్నారు. బీజేపీలో కీలక నేతతో హరీష్ మంతనాలు చేసింది ..చేస్తుంది వాస్తవం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో హరిశ్ రహస్య ఒప్పందం చేసుకున్నారని రేవంత్ ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారమని హరీష్ ఎవరికి వివరణ ఇస్తున్నారు..? టీఆరెస్ లో హరీష్ అవమానాల తో ..ద్వితీయ శ్రేణి నేతగా ఉన్నారు. నిన్నటిదాకా హరీష్ చేసిన పాపమే ఇప్పుడు అయన వంతు వచ్చిందని అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19627
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author