గెలిచే పోరాటాన్ని వీడోద్దు : మంత్రి లక్ష్మారెడ్డి

గెలిచే పోరాటాన్ని వీడోద్దు : మంత్రి లక్ష్మారెడ్డి
March 11 13:18 2018

మహబూబ్ నగర్
క్రీడలు దేహా దారుఢ్యానికి, క్రీడా స్ఫూర్తి కి దోహద పడతాయి. పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి. ఆటల్లో గెలుపు, ఓటములు సహజం అయితే, గెలిచే పోరాటాన్ని వీడొద్దని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడoగల్ గ్రామంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పొటిలను మంత్రి ప్రారంబించారు. మంత్రిమాట్లాడుతూ పోరాట స్ఫూర్తి తోనే తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ ను స్వర్ణ తెలంగాణ గా మార్చుకుందాం.
నేను గ్రంధాలయ సంస్థ చైర్మెన్ గా ఉన్న నాటి నుండి నన్ను ఈ గ్రామ భగత్ సింగ్ యువజన సంఘం వారు నన్ను క్రీడా పోటీలకు ముఖ్య అతిధిగా పిలుస్తున్నారు. అందుకు ధన్యవాదాలని అయనఅన్నారు. కోడoగల్ గ్రామ అభివృద్దికి ఎల్లప్పుడూ నా తోడ్పాటు ఉంటుంది. ఈ టోర్నమెంట్ లో దాదాపు 20 టీమ్స్ పాల్గొంటున్నాయని అయనఅన్నారు. ఈ కార్యక్రమంలో కోడ్గల్ యాదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు క్రీడాకారులు, గ్రామస్థులు పాల్గొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19644
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author