మోడీతో పాటు బాబును మనిషిగా మార్చాలి

మోడీతో పాటు బాబును మనిషిగా మార్చాలి
March 11 13:33 2018

హైద్రాబాద్,
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఒక్కొక్కరిగా గొంతు వినిపిస్తున్నారు. తాజాగా సినీ రచయిత, ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగితే సినిమా వాళ్లు ఎందుకు స్పందించడం లేదు అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగితే సినిమా వాళ్లు మాట్లాడాలా? మాట్లాడాలి నిజమే.. అయితే ఈ అన్యాయం ఎవరు చేశారో ముందు గమనించాలన్నారు.ప్రధాని మోడీ అన్యాయం చేశారని చాలా మంది అంటున్నారని.. అయితే మోడీ ప్రధాని కాకముందు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోయిందా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అంతకు ముందు రైతుల ఆత్మహత్యలు లేవా? నిరుద్యోగం లేదా? వెన్నుపోటులు లేవా? డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కోవడాలు లేవా? ఎన్ని అనాగరిక చర్యలు లేవు? అంటూ ప్రశ్నించారు.ఇక దర్శకుడు కొరటాల శివ ‘మోడీని మనిషిని చేయాలంటూ’ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. కొరటాల శివ మావాడే. నా మేనమావ కొడుకు. ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి మాట్లాడతాడు. లూజ్ టాక్ ఉండదు. వెరీ సిన్సియర్.. చాలా కామ్‌గా ఉంటాడు కాని ఈసారి ‘మోడీని మనిషిని చేయాలంటూ’ గట్టిగా మాట్లాడాడు. దీనిపై నేను కొనసాగింపుగా మాట్లాడతా అన్నారు.మోడీని మనిషిని చేయాలన్నది ఎంత వరకూ కరెక్ట్ అనే విషయాన్ని పెడదాం. అయితే అంతకంటే ముందు తేల్సాసినవి, శివకి తెలియనవి కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ప్రత్యేక హోదా అనేది ప్రజా సమస్య. ఇది రాజకీయ నాయకుల వల్ల వచ్చింది. ‘నేల సారవంతంగా ఉంటే ఏ విత్తనం వేసిన ఆ పంట పండుతుంది. నేల సారవంతగా లేకపోతే ఏ విత్తనం వేసిన కుళ్లిపోద్ది. ఇక్కడ పరిపాలించే వాడు నిజాయితీ పరుడైతే.. అర్థరూపాయి వేసినా కడుపు నిండుద్ది.. ఇక్కడ అవినీతి పరుడు ఉంటే లక్ష ఇచ్చినా కడుపు నిండదు. అవినీతి ఉంది కాబట్టే ఢిల్లీ వాళ్లు ఇలా మాట్లాడుతున్నారు. మీకెందుకు ఇవ్వాలని.. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవాలి ఎంత నిజాయితీగా ఉన్నామని.ఉదాహరణకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి మాట్లాడతా.. ఎలక్షన్ టైంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. నాకు ఓటేయండి. మీకు అది చేస్తా.. ఇది చేస్తానని… ఇప్పటికి నాలుగేళ్లైంది. ఆయన వాగ్దానం చేసిన వాటిల్లో నిరుద్యోగ భృతి ఏమైందన్నారు. కనీసం ముగ్గురికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదే.. అంటే మీరూ కూడా మాట తప్పారు కదా.. మిమ్మల్ని కూడా మనిషిగా మార్చాల్సిందే అంటూ ఎందుకు ప్రశ్నించరు? ఆయన కూడా మనిషి కాకుండా పోయాడు కదా.. ఎందుకు మాట్లాడరు. లేదంటే ఆయన కూడా మా కమ్మ వాడు కాబట్టి మా కమ్మ వాడు ఏమైనా చేయొచ్చంటారా? మాట తప్పింది మోడీ ఒక్కడే కాదు కదా.. చంద్రబాబు కూడా మాట తప్పారు కదా.. ఎన్నికల టైంలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తేనే హామీలను నెరువేస్తా అని అప్పుడు చెప్పలేదు కాదా.. వాళ్లు ఇస్తేనే చేస్తాం అని అప్పుడు చెప్పలేదు ఇప్పుడెందుకు మీరు మాట తప్పారు? మోడీ ఒక్కడే మాట తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా మాట తప్పారు ఆయన్ని మనిషిగా మార్చాల్సిందే అన్నారు పోసాని.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19655
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author