వేమిరెడ్డికి కొత్త కష్టాలు

వేమిరెడ్డికి కొత్త కష్టాలు
March 11 13:37 2018

న్యూఢిల్లీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు చిత్రమైన సంకటాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మార్చి నెలల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో ఆయన విజయం సాధించే అవకాశం ఉంది. కనీసం ఒక్క నెల అయిన పదవిని పూర్తిగా అనుభవించకుండానే ఆమాటకొస్తే అసలు పదవీ స్వీకార ప్రమాణం చేస్తారో లేదో తెలియకుండానే ఆయన పదవి వైభోగం ముగిసిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీకి చెందిన ఎంపీలు అందరితో రాజీనామా చేయిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వేమిరెడ్డి పదవీకాలం డోలాయమానంలో పడింది.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలకు పోటీ చేయడానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ ఒక స్థానానికి పోటీ చేస్తున్నది. నిజానికి వైయస్సార్ కాంగ్రెసుకు ఓట్లు కాస్త తక్కువ పడే అవకాశం ఉన్నప్పటికీ మూడో అభ్యర్థి అంటూ ఎవరూ రంగంలో లేరు గనుక వారు గెలిచే అవకాశం ఉంది. ఆ రకంగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన చిరకాలవాంఛ ఎంపీ పదవి పొందబోతున్నారు.అయితే ఇక్కడ ఆయనకు ఒక పితలాటకం ఎదురవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని , కేంద్రం పట్టించుకోకపోతే గనుక ఏప్రిల్ 6వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగిసే రోజు తమ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నడో ప్రకటించారు. ఆ లెక్కన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవి కూడా ముగిసిపోతుందని అనుకోవాలి. ఇంతోటి రెండు వారాలు కూడా నిలకడగా ఉండని పదవీ భాగ్యం కోసం వేమిరెడ్డి ఎగబడి దానిని సాధించుకోవడం అవసరమా అనే వాదన వినిపిస్తోంది.అయితే ఈ విషయంలో ఏమి రెడ్డికి వైఎస్ జగన్ దగ్గరి నుంచి ఒక హామీ ఉన్నదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాజీనామాల సమయం వచ్చినప్పుడు , లోక్‌సభ ఎంపీలే తప్ప రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసే అవసరం లేకుండా తాను మాట మారుస్తానని జగన్ చెప్పినట్లుగా పార్టీలో పేర్కొంటున్నారు. అలా జరిగితే తప్ప ఏమి రెడ్డికి ఎంపీ పదవి అనేది అచ్చమైన మూన్నాళ్ల ముచ్చట అవుతుందని పలువురు భావిస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19658
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author