టీడీపీ దూరం కావడంతో పురందరేశ్వరీకి లైన్ క్లియర్

టీడీపీ దూరం కావడంతో  పురందరేశ్వరీకి లైన్ క్లియర్
March 12 13:59 2018

న్యూఢిల్లీ,
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి పదవి ఇవ్వనుంది బీజేపీ. ఆ దిశగా కసరత్తు సాగుతోంది. ఏపీలో కమ్మ సామాజిక వర్గ నేతకు సీటు ఇస్తే బీజేపీకి కలిసొస్తుందని భావిస్తోంది. టీడీపీకి దూరంగా వెళితే…చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రయార్టీ ఇస్తే మంచిదని భావిస్తోంది.అందుకే వీలుంటే రాజ్యసభ సీటు ఇచ్చి అయినా పురందేశ్వరిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏపీ పార్టీ పగ్గాలు ఇప్పుడు కంభంపాటి హరిబాబు చేతుల్లో ఉన్నాయి. ఆయన కమ్మ సామాజిక వర్గం నేతనే. కాకపోతే ఆయనకు మంత్రి పదవితో ప్రమోషన్ ఇచ్చిన ఏపీ పార్టీ పగ్గాలను పురందేశ్వరికి ఇస్తారంటున్నారు. బీజేపీలో దూకుడుగా వెళ్లే నేతలకు ప్రాధాన్యతను ఇవ్వనుంది ఆ పార్టీ హైకమాండ్. ఏపీలో టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబును ఎలా కట్టడి చేయాలి. హోదా సాధన పోరాటంలో టీడీపీ జోరుకు ఎలా బ్రేకులు వేయాలని సమాచనలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ ప్రజల్లో తన గ్రాఫ్ పెంచుకుంటున్న టీడీపీ అధినేతను నియంత్రించే పని చేయనుంది. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలి. ఈ ప్రశ్నలన్నింటికి బీజేపీకి కనిపించిన ఒకే ఒక్క సమాధానం దగ్గుబాటి పురంధేశ్వరి. అందుకే ఆమెను ప్రొత్సహించే పని చేయనుందట. తెలుగు ప్రజలకు చిన్నమ్మగా చిరపరిచితురాలైన పురందేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పైగా ఎన్టీఆర్ కుమార్తె. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో చాలా సీనియర్ నేత. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ప్రయార్టీ బాగానే ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కు సీన్ లేకపోవడంతో ఆమె బీజేపీ పంచన చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి కేంద్ర మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకోగా…రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. బీజేపీలో ఆమె చేరినా…చంద్రబాబు మీద వ్యతిరేకతే కారణంగానే అన్నది నిజం. చంద్రబాబును నిరంతరం వ్యతిరేకించే నేతగా పురందేశ్వరికి ముద్రఉంది. అందుకే వీలున్నంతగా ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. తోడల్లుళ్లు అయినా దగ్గుబాటి, చంద్రబాబులు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. పురందేశ్వరి రాజకీయ ప్రవేశం చంద్రబాబు వైఖరితోనే జరిగిందంటారు. ఇప్పుడు అదే చంద్రబాబును దెబ్బకొట్టేందుకు బీజేపీ పురందేశ్వరిని పావుగా వాడుకునే ఆలోచన చేస్తుందట. ఏపీలో బీజేపీ తీరును తప్పు పడుతున్నారు జనాలు. హోదా విషయంలో ప్రధాని మోడీ జనాలను మోసం చేయడమే ఇందుకు కారణం. ఆ మాటకొస్తే చంద్రబాబు అలానే హోదా పై మాట మార్చి తిరిగి సరిదిద్దుకునే పని చేస్తున్నాడు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19750
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author