రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : నరసింహన్

రైతు  సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : నరసింహన్
March 12 14:21 2018

హైదరాబాద్,
కోటి ఎకరాలకు సాగు నీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. పోమవారం నాడు తెలంగాణ శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. రైతుల కష్టాలు తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మూడున్నర ఏళ్లలోనే ఎంతో ప్రగతి సాధించిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మంకగా సాగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. సురక్షిత తాగు నీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని గవర్నర్ అన్నారు. మిషన్ భగీరథ పనులు 95 శాతం పూర్తయ్యాయని గవర్నర్ చెప్పారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలకు నిరంతరం సురక్షిత తాగు నీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టామని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు యత్నించారు. వారి నినాదాల మధ్యే తన ప్రసంగం కొనసాగించారు నరసింహన్. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. మూడున్నరేళ్లలో ఎన్నో తెలంగాణ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. ప్రభుత్వం. జాతీయ సగటు కంటే రాష్ట్ర జీడీపీ అధికమన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19766
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author