ఖాళీ స్థ‌లాల్లో చెత్త వేయ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

ఖాళీ స్థ‌లాల్లో చెత్త వేయ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు
March 12 18:20 2018

హైదరాబాద్
గ్రేట‌ర్ ప‌రిధిలోని జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు వాటికి కీపాండ్ వాల్స్ నిర్మాణం, మొక్క‌లు నాట‌డం, చెత్త‌ను వేయ‌కుండా ఉండేందుకు స్థానికుల స‌హాయ స‌హ‌కారాలు, భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. స్థానికుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం ద్వారా విలువైన ప్ర‌జ‌ల‌కు చెందిన స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు వీటిని ఆట స్థ‌లాలు, పార్కులుగా అభివృద్ది చేసి ముందు త‌రాల‌కు అందించేందుకు వీల‌వుతుంద‌ని భావిస్తోంది. న‌గ‌రంలో ఉన్న ఖాళీ స్థ‌లాల‌ను ఇప్ప‌టికే పెద్ద మొత్తంలో చెత్త‌ను వేయ‌డం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారి దోమ‌ల ఉత్ప‌త్తికి కేంద్రాలుగా మారాయి. ఈ ఖాళీ స్థ‌లాలో వేసే డంపింగ్ పై అనేక మంది జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి గాను మార్చి 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు ఖాళీ స్థ‌లాల సుంద‌రీక‌ర‌ణ మాసంగా పాటించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి డిప్యూటి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. న‌గ‌రంలోని త‌మ ప‌రిధిలో ఉన్న ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించాల‌ని, వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థ‌లాలు అయితే వెంట‌నే ప్ర‌హారీగోడ‌ల‌ను త‌గు అనుమ‌తితో నిర్మించి మొక్క‌ల‌ను నాటించ‌డం, మంచి ప్లే గ్రౌండ్‌లుగా మార్చాల‌ని తెలియ‌జేశారు. ఈ ఖాళీ స్థ‌లాలు ప్రైవేట్ వ్య‌క్తుల‌కు చెందిన‌వి అయితే ఆ స్థ‌లం యజ‌మానుల‌కు పొరుగువారితో క‌లిసి గుర్తించాల‌ని అన్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థ‌లాల్లో తిరిగి చెత్త వేయ‌కుండా బోర్డుల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని అన్నారు. ఖాళీ స్థ‌లాల ఇంటి య‌జ‌మానుల‌తో ప్ర‌హరీగోడ‌ల‌ను నిర్మించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టి తిరిగి ఎవ్వ‌రు కూడా చెత్త‌ను వేయ‌కుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాల‌ని డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి సూచించారు. ప్ర‌తి ఖాళీ స్థ‌లాల‌ను ఒక జ‌వాను లేదా ఎస్‌.ఎఫ్‌.ఏ లేదా ఇత‌ర కార్మికుడిని ఇన్‌చార్జిగా నియ‌మించి ఎవ్వ‌రూ కూడా చెత్త వేయ‌కుండా నిరోధించాల‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఖాళీ స్థ‌లాల్లో చెత్త వేయ‌డం వ‌ల్ల అధికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వ‌చ్ఛ రాయ‌బారిగా నియ‌మించాల‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ ఖాళీ స్థ‌లాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేలా డిప్యూటి క‌మిష‌న‌ర్ల వ‌ద్ద వివరాలు న‌మోదు చేయించాల‌ని క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19786
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author