ప్రభుత్వ వెబ్ సైట్లపై సీఎస్ సమీక్ష

ప్రభుత్వ వెబ్ సైట్లపై సీఎస్ సమీక్ష
March 12 18:38 2018

హైదరాబాద్,
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు,ఏజన్సీల వెబ్ సైట్లను ఐటి శాఖ ద్వారా నిర్వహించే విషయమై తగు నివేdrకను 10 రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో ప్రభుత్వ వెబ్ సైట్లు, పోర్టల్ కు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఐటి డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి 265 వెబ్ సైట్లు, పోర్టల్స్ ఉన్నాయని వీటి నిర్వహణ, సమాచార ఆధునీకరణ, కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మేర నిబంధనల పాటింపు, అనువైన నూతన టెక్నాలజి వినియోగం, మొబైల్ ఫ్రెండ్లి విధానం తదితర అంశాలతో నివేధికను రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐటి శాఖ ఐటి సర్వీసు ప్రొవైడర్ గా పనిచేయాలన్నారు. అవసరమైతే CGG సహకారాన్ని తీసుకోవాలన్నారు వెబ్ సైట్ల నిర్వహణ, సమాచారం అప్ డేషన్ కు సంబంధించి ప్రభుత్వం తరపున చేపట్టవలసిన చర్యలు, ప్రతి వెబ్ సైట్ లలో ఉండవలసిన అంశాల టెంప్ లేట్, వివిధ శాఖల సర్వీసుల వివరాలు, అవసరమైన సిబ్బంది, బడ్జెట్, వెండర్ ఎంపిక తదితర అంశాలు నివేధికలో ఉండాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ లోగో, ముఖ్యమంత్రి ఫోటో ఉండాలన్నారు. వెబ్ సైట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని శాఖల వెబ్ సైట్లకు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ కేంద్ర స్ధానంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాల వివరాలు, ప్రభుత్వ జివోలు తెలుగులో అప్ లోడింగ్, వివిధ శాఖల కార్యక్రమాల వివరాలు, తెలియజేసేలా వెబ్ సైట్లు ఉండాలన్నారు
ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ఐటి శాఖ ద్వారా రాష్ట్ర పోర్టల్, ఐటి శాఖ పోర్టల్ ను నిర్వహించడంతో పాటు వివిధ శాఖలకు సహకారం అందిస్తున్నామన్నారు. డిజిటల్ మీడియా విభాగం ద్వారా ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటి శాఖా మంత్రి లు సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఫేస్ బుక్ నిర్వహణపై శిక్షణను ఇచ్చామన్నారు. వెబ్ సైట్లను మోబైల్ ఫ్రెండ్లీ గా నిర్వహించే విషయమై గూగుల్ సహకారంతో వర్క్ షాప్ నిర్వహించామన్నారు.
ప్రజా సమస్యల ఫిర్యాదులు,వాటి పరిష్కారం కోసం సూర్యాపేట జిల్లాలో అమలు చేస్తున్న జనహిత విధానాన్ని సమీక్షించారు. ప్రజలు తమ ఫిర్యాదులను ప్రత్యక్షంగా ఇవ్వడంతో పాటు ఇ-మెయిల్,ఆన్ లైన్, వాట్సాప్, మోబైల్ ద్వారా చేస్తున్నారని, 40శాతం మంది వీటి మీద ఆధారపడుతున్నారని అధికారులు సి.యస్ కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు చేసే విధానంపై చర్చించారు. ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19797
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author