కిషన్ రెడ్డి, కేసీఆర్ ల వాగ్వాదం

కిషన్ రెడ్డి, కేసీఆర్ ల వాగ్వాదం
March 13 14:03 2018

హైదరాబాద్,
మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై సోమవారం నాడు జరిగిన దాడి దురదృష్టకరమని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ముందు ఫ్లోర్ లీడర్లను పిలిచి మాట్లాడాల్సిందని ఆయన అభిప్రాయడ్డారు. దాడులు ఎవరు చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు. ఘటనపై ప్రతిపక్ష నాయకుడు పశ్చాత్తాపం ప్రకటించిన విషయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ నేతలు పోడియంవైపునకు హెడ్సెట్ విసిరేయడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడిన సంగతి తెలిసిందే.
ఈదశలో సీఎం కేసీఆర్, బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సీఎల్పీ నేత జానారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. సభలో గొడవ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉన్న జానారెడ్డిని ఎలా స్పస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. అయితే కిషన్ వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్గా స్పందించారు. అరాచకశక్తులకు బీజేపీ మద్దతుగా నిలబడం దారుణమన్నారు. సిద్ధాంతాలు మరిచి కాంగ్రెస్కు సపోర్ట్ చేసినా తమకేమి అభ్యంతరం లేదన్నారు. జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఏ కారణం లేకుండా అనవసరంగా ఎవరిని సస్పెండ్ చేయరన్నారు. జానారెడ్డిని అందరికంటే ఎక్కువగా గౌరవించింది తానేనన్నారు. నిన్న జరిగిన ఘటనను కిషన్రెడ్డి సమర్థించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తామంతా మౌనం పాటించాలా? అని అడిగారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19865
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author