సర్కారు తీరు రాజ్యాంగ విరుద్ధం

సర్కారు తీరు రాజ్యాంగ విరుద్ధం
March 13 16:24 2018

హైదరాబాద్‌
తెలంగాణ సర్కారు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందన్నారు. స్పీకర్‌ తమ వివరణ వినకుండానే నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తి చూపుతామన్న ఆందోళనతోనే ముందుగానే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు. చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో తెరాస ఎంపీలు వారం రోజులుగా ఆందోళన చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. తమపై మాత్రం చిన్న ఘటనను ఆసరాగా తీసుకుని వేటు వేయడం సరైన చర్య కాదన్నారు. నిన్నటి ఘటనలో ఏ సంబంధం లేని తనపైనా స్పీకర్‌ వేటు వేయడం షాక్‌ గురిచేసిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు మండల కేంద్రాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు జానారెడ్డి తెలిపారు.కాగా అసెంబ్లీలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఫై కాంగ్రెస్‌ సభ్యులు దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని కావాలనే అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆరోపించారు. శాసనసభలో స్పీకర్‌ కనీసం తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు. గతంలో హరీశ్‌రావు శాసనసభలో ప్రవర్తించిన తీరు కేసీఆర్‌ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లుగా నిర్ణయం తీసుకోని స్పీకర్‌… తమపై మాత్రం నిమిషాల్లోనే నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న తమను శాసనసభ నుంచి మార్షల్స్ తో బయటకు గెంటేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19874
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author