జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదు:కిషన్‌రెడ్డి

జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదు:కిషన్‌రెడ్డి
March 13 16:42 2018

హైదరాబాద్
శాసనసభలో సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ నుంచి జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదు అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. నిన్న జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? మా దగ్గర రిపోర్టులు లేవా? ఉట్టిగానే సస్పెండ్ చేస్తామా? జానారెడ్డిపై తమకు గౌరవం లేదా అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న జరిగిన ఘటనను కిషన్‌రెడ్డి సమర్థించాలనుకుంటున్నారా?అని ప్రశ్నించారు. తామంతా మౌనం పాటించాలా? అని అడిగారు.ప్రజా జీవితంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. జానారెడ్డిని అందరికంటే ఎక్కువగా గౌరవించింది తానేనని సీఎం స్పష్టం చేశారు. సిద్ధాంతాలను వీడి ఏకమవుతామంటే తాము చేసేదిమీ లేదన్నారు. 2/3 సభ్యుల ఆమోదంతో సభ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి సభ్యుడు గౌరవించాలని కోరారు. అటువైపు ఉన్న ముగ్గురు సభ్యులు సభ నడిపిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇటువైపు ఉన్న 90 మంది సభ్యులు మాట్లాడకుండా ఉండాలా? అని సీఎం కేసీఆర్ అడిగారు.కాగా బీఏసీ సమావేశం మరోసారి నిర్వహించి కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్యలను తమ పార్టీ సమర్థించడంలేదని.. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం తగదన్నారు. సీనియర్ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత జానారెడ్డిని కూడా సస్పెండ్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. సభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదని సండ్ర ఆక్షేపించారు. దీనిపై తాను స్పీకర్ వద్ద నిరసన తెలుపుతానన్నారు. ప్రజాస్వామ్యంతో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు అంతే బాధ్యత ఉంటుందని వ్యాఖ్యానించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19887
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author