పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం
March 13 19:48 2018

హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి. కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 11,103 పాఠశాలల నుంచి 5,38,867మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.45గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఈ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పదో తరగతి ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పారు. విద్యార్థులకు ఆటంకం కలగకుండా బస్సులు నడపాలని ఆర్టీసీని కోరినట్లు వెల్లడించారు. ఎగ్జామ్స్ కు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.ఇప్పటికే పాఠశాలలకు హాల్ టికెట్లు పంపించాం. వెబ్‌సైట్ నుంచి కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 148 మంది ఫ్లయింగ్ స్కాడ్‌లను నియమించామని చెప్పారు. విద్యార్థులు చూచిరాతకు పాల్పడితే ఇన్విజిలేటర్‌ను కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ బీ ఎస్ ఈ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌ సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షల నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 18004257462 కు కాల్ చేసి ఫిర్యాదులు, వినతులు చెప్పవచ్చని తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19944
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author