హామీలను సమీక్షించాలి : చంద్రబాబు

హామీలను సమీక్షించాలి : చంద్రబాబు
March 14 13:01 2018

అమరావతి,
తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ,రాజ్యసభ సభ్యులు,అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని అన్నారు. ఏపీకి పార్లమెంట్ ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలి. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించక పోవడం అన్యాయమని అయన అన్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. దశలవారీగా పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదు.ఇక్కడ శాసనసభ,శాసన మండలిలో, అక్కడ లోక్ సభ,రాజ్యసభలో ఏపి సమస్యలే ప్రతిధ్వనించాలని ఎంపీలకు చెప్పారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారు. టిడిపి ఎంపీలకు కేంద్రమంత్రి గోయల్ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరిని అవమానిస్తున్నారు..? రాష్ట్రాన్ని అవమానిస్తారా…? ముఖ్యమంత్రి ఆగ్రహించారు. బీజెపికి మిత్రపక్షం టిడిపినా,వైకాపానా అనే సందేహం ప్రజల్లో వస్తోందన వ్యాఖ్యానించారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యం. పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం జరపాలన్నారు. తరువాత రాష్ట్రంలో,జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. ఆర్ధిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా పడవచ్చు. ఆర్ధిక బిల్లులపై చర్చలో ఏపికి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై చర్చించాలని అయన ఎంపీలకు దిశానిర్దేశనం చేసారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలుపై ఢిల్లీ వేదికగా ప్రశ్నించాలి. జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని,ఉదాసీనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. జాతీయ మీడియా ఏపీ సమస్యలపట్ల సానుభూతితో వ్యవహరించాలి. సభకు ఎవరూ గైర్హాజరు కారాదు, సభల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలి. ప్రతిపక్షం లేకపోయినా సభ సజావుగా, నిరాఘాటంగా జరిగిందని ప్రజలు భావించాలని ముఖ్యమంత్రి అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=19981
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author