సందిగ్ధత..సందేహాలు..

సందిగ్ధత..సందేహాలు..
March 14 17:17 2018

వరంగల్,
సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పష్టత లేకపోవడంతో వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ రిక్రూట్‌మెంట్‌పై కన్ఫ్యూజన్ నెలకొందని, కార్మికులకు స్పష్టత ఉండడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కారుణ్య నియామకాలు అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారన్నది ఎక్కడా ప్రస్తావించలేదు. కార్మికులు దరఖాస్తు చేసుకోవడమా..? ఆసక్తి ఉన్న వారిని నేరుగా మెడికల్‌ బోర్డుకు పంపిస్తారా? అనే విషయాలేవీ ప్రకటించలేదు. దీంతో ఏ విధంగా తమ వారసులకు ఉద్యోగాలు కల్పింస్తారన్న విషయమై కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం జారీ చేసిన కారుణ్య నియామకాల ఆదేశాల్లో ఎక్కడా సరైన నిబంధనలు లేవు. ఫలితంగా తమ వారసులకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారన్న విషయమై ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. సరైన సమాచారం కోసం నానాపాట్లు పడుతున్నారు. మరోవైపు ఆరో వేతన సవరణలో ఏ విధంగా నిబంధనలు రూపొందించారో అదే విధంగా కారుణ్య నియామకాలు చేపడతామని సింగరేణి పేర్కొంది. కానీ పాత విధానంలోనే నియామకాలు చేపడతామన్న విమషయంగానీ కొత్తగా నిబంధనలు చేర్చే అంశాలను గానీ ప్రస్తావించలేదు. ఇదీ కార్మికుల్లో పలు సందేహాలకు తావిచ్చింది.

కారుణ్య నియామకాల ద్వారా చేపట్టే కార్మికునికి బదులు అతని కుటుంబీకుడికి ఉద్యోగం కల్పించే ముందు మెడికల్‌ బోర్డు పరీక్షలు తప్పనిసరి అని చెప్తున్నారు. కార్మికులు తమ అనారోగ్యం విషాలు వివరిస్తూ విధులు నిర్వర్తించలేమని దరఖాస్తు చేసుకున్న వెంటనే వైద్య మండలికి నివేదించే అవకాశం ఉంది. అక్కడ కార్మికుడు అనారోగ్యంతో విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాడని నిర్ధరించిన తర్వాతే వారసులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ అనారోగ్యం వస్తే కార్మికులు పని చేయడానికి అనర్హులో తెలీని పరిస్థితి. వారసులకు ఉద్యోగం పెట్టించాలంటే ఎంత సర్వీసు ఉండాలనే విషయంపై స్పష్టతలేదు. సర్వీసు నిబంధనలు ఖచ్చితంగా జారీ చేయకపోవడంతో కార్మికులు గందరగోళంలో ఉన్నారు. సాధారణంగా గతంలో రెండేళ్ల సర్వీసున్న కార్మికులు తమ వారసులకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు. అయితే ప్రస్తుత కారుణ్య నియామకాల ప్రకటనలో సర్వీసు ప్రస్తావన లేకపోవడం సమస్యగా మారింది. సింగరేణిలో కొంత మంది కార్మికులు ఏడాది లోపు సర్వీసు ఉన్న వారున్నారు. మరికొంత మంది సరిగ్గా రెండేళ్ల సర్వీసు ఉన్న వారున్నారు. నిబంధనలు జారీ చేసే లోగా తమ సర్వీసు తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి అన్ని స్పష్టతలతో కూడిన ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కారుణ్య నియామకాలపై ఉన్న సందేహాలకు నివృత్తి చేయాలని కోరుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20023
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author