తెలంగాణ ద్రోహి కేసీఆర్  : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

తెలంగాణ ద్రోహి కేసీఆర్  : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 
March 15 14:58 2018
 హైదరాబాద్,
యాభై  ఏళ్ల  పాలనలో 70వేల కోట్ల అప్పు అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత మూడు ఏండ్లలో 70వెల కోట్లు కేసీఆర్ అప్పు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు.  1999 ముందుకు అసలు కేసీఆర్ తెలంగాణ అనే పదం మాట్లాడని వ్యక్తి.  99కి ముందు అనేక పదవులు అనుభవించి తెలంగాణ వాదం వినిపించని వ్యక్తి కేసీఆర్ అని అయన ఆరోపించారు.  నాలుగు సంవత్సరాలు నిమ్మకు నీరెత్తినట్లు మోడీ పాట పాడిన కేసీఆర్…ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాళ ప్లేట్ ఫిరాయించారని అయన అన్నారు.  గత నాలుగు సంవత్సరాలు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ వెచ్చించలేదు.  గత నాలుగు సంవత్సరాలు రిజర్వేషన్లు పై అలసత్వం వహించింది కేసీఆర్ అని అయన విమర్శించారు.  అల్పసంఖ్యాల హక్కులను కాపాడేది అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే.  పార్లమెంట్ లో టీఆరెస్ బలం కేవలం 3శాతం మాత్రమే.  కేసీఆర్ మోడీ డైరెక్షన్ లోనే మూడో కూటమి తెరపైకి వచ్చిందని అయన అన్నారు.  తలసాని, తుమ్మల, మహేందర్ రెడ్డి ఎప్పమైనా తెలంగాణ వాదం కోసం పోరాటాలు చేశారా…?  తెలంగాణ ద్రోహి కేసీఆర్…మిషన్ కాకతీయ, భగీరథ కాంట్రాక్టులు ఆంధ్రా వ్యక్తులకు ఇచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు.  ఎప్పటికైనా మిషన్ భగీరథ, కాకతీయ అవినీతిని బయటపడుతుంది.  ప్రతిపక్షం లేకుండా శాసనసభ నడపడం కేసీఆర్ కి మాత్రమే చెల్లుతుందని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20052
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author