జనసేన అధినేత ప్రసంగం తీరు విడ్డూరం గా ఉంది

జనసేన అధినేత ప్రసంగం తీరు విడ్డూరం గా ఉంది
March 16 16:08 2018

అమరావతి
జనసేన అధినేత ప్రసంగం తీరు విడ్డూరం గా ఉందని…జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్రానికి ఏమి చేస్తారో పవన్ చెప్పలేదని, అసలు జనసేన పాలసీ ఏంటి? టీడీపీ పై బురద జల్లడమే పనిగా పెట్టు కున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం నిరాధార నిందలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అద్యక్షులు,మంత్రి కళావెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులందరూ ఏకమై కేంద్రంపై వత్తిడి తెచ్చి హోదాతోపాటు విభజన చట్టంలోని 18 హామీలు సాధించుకోవాలని ఉద్యమాలు చేస్తుంటే ఆంధ్రుల ఆకాంక్షల కోసం ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులచేత రాజీనామా చేయించి రోజూ ఎంపీల చేత పార్లమెంటును స్తంభింపచేస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న ముఖ్యమంత్రి గారిపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం… ఇప్పుడు టీడీపీ పై విమర్శల వెనుక పవన్ కుమ్మక్కైనట్టు స్పష్టం గా కనిపిస్తుందన్నారు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివే ముందు పవన్ కళ్యాణ్ ఒక్కసారి అయినా ఆలోచించుకోవాలని మంత్రి హితవుపలికారు. రాష్ట్రప్రయోజనం కోరే పార్టీ ఏదైనా కేంద్రాన్ని టార్గెట్ చేయాలేగాని సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. నిన్న ఆవిర్భావ సదస్సులో పవన్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించకుండా సీఎం గారి కుటుంబంపై నిరాధార నిందలు వేయడం ఎవరి స్క్రిప్టుతో చేస్తున్నారో 5 కోట్ల ఆంధ్రులకు అనుమానం కలిగిస్తున్నది, హోదా ఇవ్వాల్సిన మోడీ గారిని ఒక్కమాట కూడా అనకుండా ముఖ్యమంత్రి పై దాడి కేంద్రీకరించడం బాధాకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన నారా లోకేష్, తాత, తండ్రి వలే ప్రజాసేవ నిమిత్తం సుఖమైన జీవితాన్ని వదలి 34 ఏళ్ళ వయస్సులో భార్యాబిడ్డలకు దూరంగా వుంటూ గ్రామాల అభివృద్ధికి, ఐటీ రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం లోకేష్ కృషిచేస్తున్న లోకేష్ పై నిరాధార నిందలేయడమంటే యువశక్తిని నిర్వీర్యంచేయడం కాదా అని మంత్రి ప్రశ్నించారు.రాష్ట్రం లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రన్న భీమా, పించన్లు వంటి అనేక సంక్షేమ పధకాలను అమలుచేసున్నామన్నారు.ఇలాంటి తరుణంలో బురద జల్లుతాను…కడుక్కోండి అనే లా పవన్ మాట్లాడారని, పవన్ స్పీచ్ వెనుక ఏదో శక్తి ఉందని, నాలుగేళ్ళలో పవన్ ఏపీలో అవినీతి ఉన్నదని రాతపూర్వకంగా ఏనాడూ ప్రభుత్వానికి తెలుపలేదనేది వాస్తవం కాదా? పవన్ తో కలవకముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 120 ఎమ్మెల్యే సీట్లులలో మెజార్టీ వచ్చింది. పవన్ ,బిజేపి తో కలిసిన తరువాత మాకు 106 సీట్లే వచ్చాయని పొత్తు వల్లే అధికారానికి వచ్చామనేది అవాస్తవం. కొత్త రాష్ట్రానికి కేంద్ర సహాయం అవసరమనే బీజేపీతో పొత్తు పెట్టుకొన్నామనేది వాస్తవమని, 5 కోట్ల ఆంధ్రులు ఆశించిన సహాయం కేంద్రం నుండి ఏపీకి రానందున నేడు హోదాతోపాటు విభజన చట్టంలోని 18 హామీల కోసం తెలుగుదేశం పోరాడుతున్నదని ఈ సమయంలో రాష్ట్రప్రయోజనం కోరే పార్టీ ఏదైనా కేంద్రాన్ని టార్గెట్ చేయాలిగానీ సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయరాదు. కానీ నిన్న ఆవిర్భావ సదస్సులో పవన్ పార్టీ విధానాలను ప్రజలకు వివరించకుండా సీఎంగారి కుటుంబంపై నిరాధార నిందలు వేయడం 5 కోట్ల ఆంధ్రులకు అనుమానం కలిగిస్తున్నది. హోదా ఇవ్వాల్సిన మోడీ గారిని ఒక్కమాట అనుకుండా సీఎం గారిపై దాడి కేంద్రీకరించడం బాధాకరం.దేశవ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన టిటిడీ దేవస్థానంకు బోర్డు మెంబర్లుగా పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్దనమేరకు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి తమిళనాడు సీఎం జయలలిత కోరితేనే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చాం..తప్ప మాతో ఏ సంబంధం లేదు శేఖర్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన వెంటనే టిటిడి బోర్డు మెంబర్ నుంచి రద్దు చేశాం.
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లలో రాయలసీమలోని శ్రీశైలం డ్యామ్ నుండి రాయలసీమకు 145 టీఎంసీ లు నీటిని ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు, చంద్రబాబు హయాం లొనే రాయలసీమ పై ప్రత్యేక దృష్టి పెట్టి కరువు ప్రాంతాలకు నీటిని అందించామన్నారు. పట్టిసీమ నిర్మించడం ద్వారా మిగులు జలాలను రాయలసీమకు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నారు. రాయలసీమలో కియా, ఫాక్స్ కాన్, షియోమి, ఇసుజి, సెలకాన్ వంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు వచ్చాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా కర్నూలులో 1000 మె.వా సౌరవిద్యుత్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు.
రేషన్లో బయోమెట్రిక్ పెట్టి రూ.1000 కోట్లు ప్రజాధనం కాపాడాం, గృహనిర్మాణంలో జియోట్యాగింగ్ పెట్టి అవినీతిని అరికట్టాం, వైయస్ పాలనలో 14.5 లక్షల గృహాలు కట్టకుండానే రికార్డులు సృష్టించి 4 వేల కోట్లు తినేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించి అక్రమరవాణాని వేల కోట్ల అటవీ సంపదను రక్షించామన్నారు, ఇసుకలో అవినీతిని అరికట్టడానికి అనేక చర్యల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని అరికట్టలేదనే పవన్ కళ్యాణ్ అనడం భాదాకరం. అవినీతి ఏదైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 2003లో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిలో దేశంలో మొదటి స్థానంలో ఉండేది, మా ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోరాటం వల్ల అవినీతిలో ఏపీ ప్రథమస్థానం నుండి 2015 నాటికే 13వ స్థానానికి తగ్గిందని ఎన్ సిఏఈఆర్ నివేదిక ప్రకటించడం వాస్తవం కాదా? దయచేసి నిరాధారణ ఆరోపణలు చేయవద్దని పవన్ కళ్యాణ్ కి మంత్రి హితవు పలికారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20115
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author