నెల్లూరులో ఆగని ఇసుక అక్రమాలు

నెల్లూరులో ఆగని ఇసుక అక్రమాలు
March 19 11:28 2018

నెల్లూరు,
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్లు ఇసుక విధానాన్ని మార్చి ఉచితం చేసినా అక్రమ రవాణా ఆగడం లేదు. కొంత మంది ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేసుకొని కాసులు పిండుతున్నారు. నెల్లూరు జిల్లా చెన్నై రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో పెద్దఎత్తున ఇసుక తరలిపోతోంది. అక్రమ రవాణాపై సరిహద్దులో తనిఖీ లేకుండాపోయింది. పర్యావరణ అనుమతి లేని ఇసుక రేవులో సైతం అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కోట్ల ఆదాయాన్ని కోల్పోయి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఉచిత ఇసుక మాటున అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది. అనుమతి పొందిన ఇసుక రేవులు కొంతమంది నేతల గుత్త్ధాపత్యంలో ఉండగా అనుమతిలేని రేవుల నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నెల్లూరు ఇసుక నాణ్యత ఉండడం దీనికి కారణం. చెన్నై, బెంగళూరు రాష్ట్రాల్లో నెల్లూరు ఇసుకకు మంచి గిరాకీ ఉంది. అధికార పార్టీ నాయకులు ప్రాబల్యం ఉన్నచోట వేలాది టన్నుల ఇసుకను నిల్వ చేశారు.ట్రాక్టర్‌కు రూ.250, లారీకి రూ.500లు వసూలు చేస్తున్నారు. ఇసుక రవాణా నేతల చేతుల్లోనే ఉంది. నెల్లూరు జిల్లాలో నేతలు పోటీ పడి ట్రాక్టర్లు, లారీలలో ఇసుక వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. దీనికి 25కి.మీ వరకు దాదాపు రూ.2వేల నుంచి 2,500ల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు జిల్లాలో సుమారు రూ.100కోట్ల ఆదాయం వచ్చింది. సుమారు ఇక్కడ 13 రేవులు నిర్వహించారు. యూనిట్ ఇసుకకు రూ.1500 విక్రయించారు. లోడింగ్‌కు అదనంగా రూ.200లు తీసుకునేవారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు మూడు క్యూబ్‌మీటరు ఇసుక రూ.1500, లోడింగ్‌కు రూ.200లు 25 కి.మీ వరకు రవాణా రూ.1200 ఉండేది. ప్రస్తుతం ఇసుక ఉచితంగానే ఇస్తున్నా స్థానికులకు రూ.200లు, లోడింగ్ రూ.300లు, రవాణా రూ.2వేల నుంచి రూ.2500లకు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత ఇసుక నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదు. ప్రభుత్వం మాత్రం కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రధానంగా స్థానిక సంస్థలకు రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. ఇసుక రీచ్‌ల నుంచి వచ్చే ఆదాయం అందాల్సి ఉంది. నగర సంస్థలకు, పురపాలక సంఘాలకు అందాల్సి ఉంది. ఆ మేరకు ఆదాయం కోల్పోయాయి.
నెల్లూరు జిల్లా నుంచి చెన్నై, బెంగుళూరుకు ఇసుక భారీగా తరలిపోతుంది. సరిహద్దు ప్రాంతాలు సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ నుంచి రవాణా జరుగుతుంది. సూళ్లూరుపేట నుంచి సిలికాన్‌కు మంచి డిమాండ్ ఉంది. బెంగళూరులో నెల్లూరు ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. బెంగళూరులో ఒక లారీ రూ.20 వేలు పలుకుతుండడంతో అక్రమార్కులు దీనిని వ్యాపారంగా మార్చుకున్నారు. చెన్నైలో ఒక లారీ ఇసుక రూ.25వేల వరకు పలుకుతుంది. దీనికి కొందరు నేతలు అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సర ిహద్దులో తనిఖీలు చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20175
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author