హోం గార్డు ఆత్మహత్య

హోం గార్డు ఆత్మహత్య
March 19 12:46 2018

విజయవాడ,
కృష్ణా జిల్లా నున్న సమీపంలోని సుబ్బయ్యకుంట పొలాల్లో హోంగార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కనగాల శ్యామ్ ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. శ్యామ్ అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు నున్న పోలీసులు భావిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ఇటీవల ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆ వివాహిత భర్త సత్యనారాయణపురం పీయస్ లో వివాహిత భర్త ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు హోంగార్డ్ కి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగం పోతున్న భయంతో శ్యామ్ ప్రసాద్ నిన్న రాత్రి ఇంటి నుండి బయటకి వెళ్లిపోయాడు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబసభ్యులు రాత్రి నుండి శ్యామ్ ప్రసాద్ కోసం గాలించారు. తరువాత అతడి మృతదేహం గురించి సమాచారం తెలిసింది. శ్యామ్ వన్ టౌన్ స్టేషన్ లో పనిచేస్తూ దుర్గగుడిలో హోంగార్డ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20208
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author