లాలుచీ రాజకీయాలు : సీఎం చంద్రబాబు

లాలుచీ రాజకీయాలు : సీఎం చంద్రబాబు
March 19 12:50 2018

అమరావతి,
సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఒకవేళ అవిశ్వాస తీర్మానం తిరస్కరిస్తే రాజ్యాంగాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్సన చేయాలని సూచించారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయం పై రాష్ట్రవ్యాప్తంగా మండల, గ్రామ స్థాయిలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేయాలని అన్నారు. అవిశ్వాసంపై అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నాం. ఏపీ కి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. మన హక్కులకోసం ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఇదికీలక సమయం అందరూ అప్రమత్నంగా ఉండాలి, ఎవరూ అధైర్య పడరాదు. న్యాయం చేయమని మనం అడుగుతున్నామని అన్నారు. న్యాయం కోరిన వారిపై యుద్ధం చేస్తారా అని ? బిజేపి నేతలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీకి హోదా ఇస్తానని కాంగ్రెస్ కూడా ప్లీనరీలో చెప్పింది. అటువంటప్పుడు కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటని అయన నిలదీసారు. కేసుల మాఫీ కోసం జగన్ అప్పుడు కాంగ్రెస్ తో లాలూచీ పడి, ఇఫ్పుడు బిజేపితో లాలుచీ పడుతున్నాడు. ఆరోజు కూడా టీడిపి ఎంపీల చాటున లోక్ సభలో దాక్కున్నారని అయన అన్నారు. ఇప్పుడు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. ఒక పార్టీతో అవిశ్వాసం పెట్టించడం, మరో పార్టీతో గొడవ చేయించడం, సభ వాయిదా వేసుకుని పోవాలని చూస్తున్నారు. ఇది లాలూచీ రాజకీయాలకు పరాకాష్ట అని అయన విమర్శించారు. కేంద్ర పెద్దలను పదే పదే కలవడం పిఎంవోలో విజయసాయిరెడ్డి తిష్టవేయడం ఇంతకన్నా రుజువులు ఏమి కావాలిని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ యూ టర్న్ ఎందుకు తీసుకున్నాడో అందరికీ తెలుసు. నాలుగేళ్ళుగా విమర్శించని వ్యక్తి ఇప్పుడే ఎందుకు విమశ్శలు చేస్తున్నాడని అయన ప్రశ్నించారు. ద్రోహలు ఎవరీకి డిపాజిట్లు కూడా రావు. తప్పుడు పనులు చేసే వారు దొంగాట ఆడుతున్నారు. రెడ్ హ్యండెడ్ గా ఫోటోలతో సహా దొరికి పోయారు.కుట్ర రాజకీయాలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. అన్నీ నియోజక వర్గాలలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. ఇంటింటికీ ప్రచారం చేయాలి, కరపత్రాలు పంపిణీ చేయాలి. గ్రామా గ్రామాణ ప్రచారం ఉదృతం చేయాలి. లాలూచీ రాజకీయాలను బయట పెట్టాలి, కుట్ర రాజకీయాలను ఎండ కట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలపై ఏపీ ప్రజల హక్కులపై రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. విభజన చట్టంలోని 19 అంశాలు, పార్లమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాక కేంద్రం చేయూత ఇవ్వాలని అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20211
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author