కొలిదిబ్బలో మంత్రి సోమిరెడ్డి పర్యటన

కొలిదిబ్బలో మంత్రి సోమిరెడ్డి పర్యటన
March 19 13:00 2018

నెల్లూరు,
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీ కొలిదిబ్బలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సంర్బంగా అయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. 9 ఎన్టీఆర్ గృహాల గృహప్రవేశం తో పాటు 39 మంది గిరిజనులకు వలలు, సైకిళ్లు, 34 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకంలోనూ గిరిజనుల అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గిరిజన ఆడబిడ్డలకు పెళ్లికానుకగా గిరి పుత్రిక పథకం ద్వారా రూ.50 వేలు అందజేస్తున్నాం. గిరిజనులు చైతన్యంతో ముందుకు సాగి ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..అందరూ చదువుకుని ఉజ్వల భవిత పొందాలని మంత్రి అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20213
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author