అదిలాబాద్ రెండు పీహెచ్ సీలకు డాక్టర్లు

అదిలాబాద్  రెండు పీహెచ్ సీలకు డాక్టర్లు
March 19 13:47 2018

అదిలాబాద్,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నిర్మించిన జిల్లాలోని 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి ఒక్కోదానికి వైద్యులు సహా 9 మంది సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.రెండు మూడు నెలల్లో నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శిథిలమైన భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు. దీనికి ఇదివరకే సిబ్బంది ఉండగా, రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్, ధర్మపురి మండలం నేరెళ్లలో ఒక్కో కేంద్రానికి 9 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లేదా పబ్లిక్ హెల్త్ నర్స్, స్టాఫ్ నర్స్, మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ లేదా హెల్త్ ఎడ్యుకేటర్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున మంజూరు చేశారు. ఔట్ సోర్సింగ్ కింద జూనియర్ అసిస్టెంట్, ఫిమేల్ నర్స్ లేదా మేల్ నర్స్, అటెండర్ కం వాచ్‌మన్ చొప్పున మొత్తం 63 కొత్త పోస్టులు మంజూరు చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులను సర్దుబాటు చేసుకుని తిరిగి కొత్త పోస్టులు వచ్చిన తర్వాత భర్తీ చేసుకునే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మాత్రం నియమించుకోవల్సి ఉంటుందనీ, దీనికి రెండు మూడు నెలల సమయం పట్టవచ్చునని చెబుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20231
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author