లక్షా పదహారువేలకు పెరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్

లక్షా పదహారువేలకు పెరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
March 19 15:46 2018

హైదరాబాద్,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇచ్చే ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు రూ.75 వేల నుంచి రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు తెలిపారు. పేదరికం మనషుల్ని అనేక రకాలుగా వేధిస్తోందని అన్నారు. సోమవారం నాడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రులు వేచి ఉంటున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా బాల్య వివాహాలను నిరోధించగలిగామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పరిపాలనలో మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించిన మీదట పేద ఆడపిల్లలకు అండగా నిలవాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. పెళ్లి కోసం ఖర్చును ఊహించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారన్నారు. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలని కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద వినతులు పెరుగుతున్నాయన్నారు. ఈ పథకం కింద అందే సాయాన్ని తొలుత రూ. 51 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఆ తరువాత దాన్ని రూ. 75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3.65 లక్షల మందికి లబ్ది చేకూరిందని అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. పేద కుటుంబాలకు ఎంతో ఆసరగా నిలుస్తున్న ఈ పథకం తనకెంతో సంతృప్తి ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20244
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author