మరో దాణా కేసులో లాలు దోషి

మరో దాణా కేసులో లాలు దోషి
March 19 16:48 2018

రాంచీ,
నాలుగో దాణా కేసులోనూ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు విత్ డ్రా చేసుకున్నారన్న కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఇదే కేసులో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను మాత్రం నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. శనివారమే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉన్నా.. కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇప్పటికే ఇదే దాణాకు సంబంధించి మూడు కేసుల్లో దోషిగా తేలిన లాలూ రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఆయనకు మూడు కేసుల్లో కలిపి 13.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప మెడికల్ సైన్సెస్‌లో చికిత్స కోసం తీసుకెళ్లారు. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కాలేదు. 1995 నుంచి 1996 జనవరి మధ్య దుమ్‌కా ఖజానా నుంచి వీళ్లు అక్రమంగా నిధులు విత్ డ్రా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో లాలూ బీహార్ సీఎంగా ఉన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20260
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author