భూముల వివరాలను 28 లోగా అందజేయాలి

భూముల వివరాలను 28 లోగా అందజేయాలి
March 19 16:56 2018

హైదరాబాద్
రైతుల ఖాతాల వారిగా ఆధునీకరించిన భూముల వివరాలను రెవెన్యూశాఖ ఈ నెల 28 లోగా వ్యవసాయశాఖకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.సోమవారం సచివాలయంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయంపై రెవెన్యూ, ఆర్ధిక, వ్యవసాయ, నైస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలకు సంబంధించి మొత్తం విస్తీర్ణం, సర్వే నెం, ఖాతాల వివరాలు, రైతుల వివరాలు, తహసీల్దార్లతో సర్టిఫై చేయించి సమర్పించాలన్నారు.రెవెన్యూశాఖ ద్వారా వ్యవసాయ భూముల వివరాలు అందగానే వ్యవసాయ శాఖ చెక్కుల ముద్రణకు ఏర్పాట్లపై కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా గ్రామాల వారిగా చెక్కుల సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకర్స్ సమావేశం నిర్వహించి బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సంబంధిత విఆర్ ఓ లను బాద్యులు చేయాలన్నారు. భూరికార్డుల వివరాలను కలెక్టర్లు రాండమ్ గా వెరిఫై చేయాలన్నారు. చెక్కుల ముద్రణకు షెడ్యూల్ ను రూపొందించుకోవాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి పూర్తిగా చెక్కులు మండలాల వారిగా, గ్రామాల వారిగా అందుబాటులో ఉండాలన్నారు.గ్రామాల వారిగా రిజిష్ట్రర్లు నిర్వహించాలన్నారు.ఏప్రిల్ 19 న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి చెక్కులు పంపిణీని ప్రారంభిస్తారని అందుకనుగుణంగా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్నారు. వ్యవసాయ పెట్టుబడి చెక్కుల భద్రతకు తగు చర్యలుండాలన్నారు. గ్రామాల వారిగా భూ వివరాలకు సంబంధించి విఆర్ ఓ లకు ఓటీపీ విధానం ద్వారా అందుబాటులోకి తీసుకరావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాలకు బ్యాంకుల వారిగా చెక్కుల ముద్రణపై ప్రత్యేకంగా సమీక్షించుకోవాలన్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా గ్రామాలలో ఎటువంటి ఇబ్భందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెట్టుబడి సహాయం అందలన్నారు. రోజు వారిగా చెక్కుల పంపిణి వివరాలను వ్యవసాయ శాఖ కమీషనర్ కు కార్యాలయానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామక్రిష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి, సిసిఎల్ ఏ డైరెక్టర్ కరుణ, వ్యవసాయశాఖ కమీషనర్ జగన్ మోహన్ లు, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20264
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author