ఆరువారాలపాటు ఎన్నికల నోటీసులు వద్దు : హైకోర్టు

ఆరువారాలపాటు ఎన్నికల నోటీసులు వద్దు : హైకోర్టు
March 19 17:19 2018

హైదరాబాద్,
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లకు స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యే బహిష్కరణ కేసు పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నాడు కాంగ్రెస్ సభ్యుల శాసనసభ సభ్యత్వం రద్ధుపై పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆరు వారాల పాటు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతోపాటు, గవర్నర్ ప్రసంగం రోజు శాసనసభలో జరిగిన వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్తి అయ్యేవరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకుంగా ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఈ నెల 22 తేదీన కౌంటర్ వీడియో సీడీ లను షీల్డ్ కవర్లలో సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారం కు వాయిదా వేసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్‌ఫోన్స్ విసిరి దాడికి పాల్పడ్డారంటూ కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20273
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author