ఫస్ట్ లుక్ లో రంగమ్మత్త

ఫస్ట్ లుక్ లో రంగమ్మత్త
March 19 19:22 2018

హైద్రాబాద్,
మోకాళ్ల వరకూ పసుపు రంగు చీరకట్టి.. నల్లని రవిక తొడిగి.. నుదటపైన రూపాయంత బొట్టుపెట్టి.. కళ్లకేమో కాటుకెట్టి.. మట్టిగాజులు చేతికెట్టి.. వేళ్లకేమో మెట్టెలు తొడుగుతూ.. ఓరచూపుతో గుచ్చి గుచ్చి చంపేస్తుంది రంగమ్మత్త. ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకి అత్తగా నటిస్తున్నట్టు నిన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రేక్షకులకు తెలియజేసిన యాంకర్ అనసూయ.. తాజాగా రంగమ్మత్త ఫస్ట్‌లుక్‌తో తిరిగి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇటీవల కాలంలో పిల్లోడి చేతిలో ఫోన్‌ పగల కొట్టిన వివాదంలో హర్ట్ అయ్యి సోషల్ మీడియా నుండి క్విట్ అయిన అనసూయ తిరిగి ఇదిగో మీ రంగమ్మత్త అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది. రంగస్థలం ప్రి రిలీజ్ వేడుకలో యాంకర్ అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, చెర్రీతోపాటు డైరెక్టర్ సుకుమార్ సైతం అనసూయ పాత్రను పొగడ్తలతో ముంచెత్తడంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.కాగా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ రంగమ్మత్త ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రంగమ్మత్త ఫస్ట్‌లుక్‌లో ఓ పల్లెటూరులో మధ్య వయస్సు మహిళ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనసూయ. కట్టు, బొట్టు పాతకాలం అత్తకు కరెక్ట్‌గా సరిపోయిందంటూ రంగమ్మత్త కొత్త గెటప్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా మొదట్లో ఈ పాత్ర తాను చేయనని గోల చేశానని.. అయితే తాను రామ్ చరణ్‌కు మాత్రమే అత్తనని అంటున్నారు అనసూయ

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20312
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author