మూడొందల కోట్ల లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్లాట్ల అమ్మకం

మూడొందల కోట్ల లక్ష్యంగా హెచ్ఎండీఏ ప్లాట్ల అమ్మకం
March 21 14:09 2018

హైద్రాబాద్,
హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న లే అవుట్స్‌లో ప్లాట్లు, భూములకు సంబంధించిన ఈ-టెండర్, ఈ-వేలం పాటకు చెందిన డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఈ-వేలం, ఈ-టెండర్ ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ-వేలం, ఈ-టెండర్ ద్వారా వేలం వేయనున్న 229 ప్లాట్ల ద్వారా రూ. 300కోట్లు సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని చెప్పారు. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లోని ప్లాట్లను కూడా త్వరలో వేలం ద్వారా అమ్మనున్నామని, రానున్న ఆరు నెలల్లో పలు వేలం పాటల ద్వారా రూ.1000కోట్లు సేకరించి పలు అభివృద్ధి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ టెండర్, ఈ-వేలంలో 1,16,046 చదరపు గజాల విస్తీర్ణంలోని 229 ప్లాట్లను వేలం వేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. 88 గిఫ్ట్‌డీడ్ ద్వారా వచ్చిన ప్లాట్లు, 141 గతంలో హెచ్‌ఎండీఏ చేసిన లే అవుట్లలోని ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. పారదర్శకంగా ఉండేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ టెండర్, ఈ- వేటం పాట ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ ను మంగళవారం నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పొందవచ్చారు. ఈ దస్తావేజు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ WWW.HMDA.GOV.INలో పొందవచ్చన్నారు. ఈ -వేలం, ఈ -టెండర్ ద్వారా వేలం వేయనున్న 229 ప్లాట్లు ప్రముఖ ప్రాంతాల్లోనే ఉన్నాయని కమిషనర్ చిరంజీవులు చెప్పారు. దాదాపు 12 సంవత్సరాల కిందట సంస్థ చేసిన లే అవుట్లు, ప్రైవేట్ రియల్ సంస్థలు చేసిన లే అవుట్లలోని గిఫ్ట్‌డీడ్ ద్వారా సంస్థ పొందిన స్థలాలను వేలం వేస్తున్నామని తెలిపారు. పోచారం, అంతారం, దూలసల్లి, మంకల్, మామిడిపల్లి, భువనగిరి, బాచుపల్లి, జల్‌పల్లి, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, అమీన్‌పూర్ గ్రామాల్లో గిఫ్ట్‌డీడ్ స్ధలాల వేలం ఉంటుందన్నారు. గోపన్‌పల్లి, నల్లగండ్ల, చందానగర్, సరూర్‌నగర్, నెక్నాంపూర్, నందగిరి హిల్స్(జూబ్లీహిల్స్), అత్తాపూర్, షేక్‌పేట, వనస్థలిపురం, ముస్కామహల్, మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీ, తెల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ సెక్టార్-1, మాదాపూర్ సెక్టార్-3లలో హెచ్‌ఎండీఏకు చెందిన లే అవుట్లలోని ప్లాట్లు వేలం వేసే వాటిలో ఉన్నాయన్నారు. ఈ సారి వేలం దారులకు ఉపయోగంగా ఉండాలని నిర్ణయించి వేలం వేయబోయే ప్లాట్లను గూగుల్ మ్యాపింగ్‌తో క్రోడికరించామని, ప్రతి ప్లాటును గూగుల్ కో ఆర్డినేట్స్‌తో వెబ్‌సైట్‌లో పెట్టామని చెప్పారు. వేలం వేయబోయే ప్లాట్లకు ఎలాంటి కోర్టు వివాదాలు లేవని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ కార్యదర్శి అరుణ కుమారి, మెంబర్ ఎస్టేట్ లత, ఎస్టేట్ అధికారి గంగాధర్, సిఐఓ సుబ్రమణ్యం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ -వేలం, ఈ- టెండర్‌లో పాల్గొనదలిచిన వారు ముందుగా రూ. 10వేలు చెల్లించి తన పేరు నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. ఆ తర్వాత తాము ఏ ప్లాటు కొనదలుచుకున్నారో ఆ స్థలాలకు సంబంధించిన ఈఎండీ మొత్తాన్ని చెల్లించాలి.వేలం పాట సమయంలో ఆన్‌లైన్ ద్వారా హెచ్‌ఎండీఏ పేర్కొన్న ఆప్షనల్ విలువ కన్నా కనీసం 100 రూపాయలు ఎక్కువ పాడాల్సి ఉంటుంది.వేలం పాటలో ఇష్టం లేకపోతే ఈ- టెండర్ విధానంలో కూడా వారు కొనదలుచుకున్న ప్లాట్ ధరను పేర్కొనవచ్చు.హెచ్‌ఎండీఏ తాను అమ్మకానికి పెట్టిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరకు ఒకటిన్నర రేట్ల ధర నుంచి మూడున్నర రేట్ల ధరను ఆప్షనల్ ధరగా పేర్కొన్నదని, ఆది మార్కెట్ రేటు కన్నా తక్కువగానే ఉంటుందని అధికారులు చెప్పారు.వేలంలో ఒకే బిడ్డర్ పాల్గొంటే హెచ్‌ఎండీఏ ఆ వేలాన్ని రద్దు చేసి తిరిగి వేలం పాట రెండోసారి నిర్వహిస్తుంది.ఏ దశలో నైనా వేలం పాట రద్దు చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉంటుంది.
ఈ -వేలం పాట, ఈ -టెండర్ వచ్చే నెల 10, 11, 12వ తేదీల్లో ఉదయం 9 -12 గంటల వరకు, మధ్యాహ్నం 1-4గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు.ప్రతి రోజూ ఉదయం 36, మధ్యాహ్నం 36 కలిపి మొత్తం 72 ప్లాట్లు వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థ (థర్డ్ పార్టీ) ద్వారా నిర్వహిస్తారు. ఏ ప్లాటుకు ఎవరు? ఎంత పాడుతున్నారు? ఎంతకు అమ్ముడుపోతాయన్న వివరాలు హెచ్‌ఎండీఏకు కూడా తెలియకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేలంలో ఎక్కువ ధరకు ప్లాట్లు పొందిన వారికి వాయిదాల పద్ధతిలో కూడా ప్లాటు ధరను చెల్లించుకోవచ్చు. కొనుగోలుదారుడు వారం రోజుల లోపు ప్లాటు ధరలో 25శాతం చెల్లించాల్సి ఉంటుందిఈఎండీ ధర 10శాతం పోను, మిగతా 65 శాతం ధరను 60 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ వాయిదాల ద్వారా చెల్లించాలనుకున్నా 60 రోజుల అనంతరం నిర్థారిత వడ్డీతో ఏడాదిలో చెల్లించుకునే వీలును కల్పించారు.బ్యాంకు రుణం పొందేందుకు కొనుగోలుదారులకు హెచ్‌ఎండీఏ అవసరమైన ప్రమాణ పత్రాన్ని జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20353
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author