కారుణ్య నియామాకాలకు సింగరేణి రెడీ

కారుణ్య నియామాకాలకు సింగరేణి రెడీ
March 21 15:02 2018

హైద్రాబాద్,
సింగరేణి కాలరీస్‌లో బొగ్గు గని కార్మికులపై ప్రభుత్వం మరింత కరుణ కురిపించింది. ఈ మేరకు ఇప్పటికే కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభానికి యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ అంశంపై కార్మికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ నెరవేరే తరుణం ఆసన్నమైంది. అంతేకాకుండా ఈ నియామకాలలో ఎలాంటి ఇబ్బందు లకూ తావులేని విధంగా మెడికల్ బోర్డు జాబితాలో వ్యాధుల సంఖ్య ను పెంచాలని సీఎం సూచించారు. ఆ మేరకు అదనంగా 16 వ్యాధుల ను చేరుస్తూ సింగరేణి యాజమా న్యం సోమవారం ఉత్తర్వులు (సీఆర్‌పీ/పీఈఆర్/ఐఆర్/సీ/081/305) ఇచ్చింది. ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు కొత్త గనుల ప్రారంభానికీ సన్నాహాలు మొదలు కావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వారసత్వ ఉద్యోగాలిస్తామని లోగడ సీఎం ప్రకటించిన సమయంలో గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తడంతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదించింది. తదనుగుణంగా వారసత్వం స్థానే కారుణ్య నియామకాలకు శ్రీకారం చుట్టింది. అయితే, దీనిపైనా సందేహ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వాటిని తుత్తునియలు చేస్తూ సీఎం సూచన మేరకు సీఎండీ శ్రీధర్ సంబంధిత ఉత్తర్వులు జారీచేశారు. తద్వారా మెడికల్ బోర్డు జాబితాలో మరో 16 వ్యాధులను చేర్చి కార్మికులకు వెసులుబాటు కల్పించారు.సీఎం కేసీఆర్ లోగడ ఇచ్చిన హామీ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారందరికీ సర్వీస్‌తో నిమిత్తం లేకుండా కారుణ్య నియామకాలలో అవకాశం కల్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు. మెడికల్ బోర్డు జాబితాలో అదనపు వ్యాధులను చేర్చిన తరహాలోనే తమపైనా కరుణ చూపి వెసులుబాటు కల్పించాలని విన్నవిస్తున్నారు. దళారుల బెడద లేకుండా అర్హులందరికీ కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించి తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కార్మిక కుటుంబాలు ఆకాంక్షిస్తున్నాయి. మరోవైపు కొత్త గనుల ప్రారంభానికి సీఎం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యాజమాన్యం తన కసరత్తును ముమ్మరం చేసింది.కేన్సర్, మూత్రపిండ వ్యాధులు, మెదడు సంబంధిత వ్యాధులు, పక్షవాతం, కాలేయ వ్యాధులు, పార్కిన్సన్ వ్యాధి, అవయవాలు కోల్పోవడం, గుండెజబ్బు, క్షయ, హెచ్‌ఐవీ (ఎయిడ్స్), కుష్ఠు, కీళ్ల నొప్పులు, దృష్టిలోపం, మానసిక వ్యాధులు, ఊపిరితిత్తులను బలహీన పరిచే దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల్లో క్షతగాత్రులైన నిస్సహాయ స్థితి.. తదితర వ్యాధులు, పరిస్థితుల్లో ఉన్నవారు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని యాజమాన్యం ప్రకటించింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20368
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author