నిర్దేశిత గ‌డువులోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్తి చేయాలి

నిర్దేశిత గ‌డువులోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్తి చేయాలి
March 21 15:26 2018

హైద‌రాబాద్‌,
నిర్దేశిత గ‌డువులోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని మంత్ర‌లు జోగు రామ‌న్న‌, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల పురోగ‌తిపై మంత్రులు స‌మీక్ష నిర్వ‌హించారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల విష‌యంలో ఎలాంటి నిర్లిప్త వైఖ‌రిని స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని వారు ఆదేశించారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌నుల పురోగ‌తిపై కూలంక‌షంగా చ‌ర్చించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌నుల పూర్తికి తాజా గ‌డువును నిర్దేశించారు. ముఖ్యంగా మంచిర్యాల‌, బెల్లంప‌ల్లి, మందమ‌ర్రి మున్సిపాలిటీల‌తోపాటు నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న తీవ్ర మంచినీటి ఎద్ద‌టి ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న మంచినీటి స‌మ‌స్య‌ల‌పై మంత్రులు తీవ్రంగా స్పందించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న పైప్‌లైన్ ప‌నుల‌ను పూర్తి చేసి మంచినీటి స‌మ‌స్య లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రులు అధికారుల‌కు సూచించారు. ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ల ఏర్పాటు, మోట‌ర్ పంపుల‌ బిగింపు, ఇంట్రా విలేజీ ప‌నులతోపాటు ప‌లు అంశాల‌పై లోతుగా మంత్రులు స‌మీక్షించారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల వేగ‌వంతం కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసుకుని, త్వ‌రిత‌గ‌తిన ప‌నుల పూర్తి చేయాల‌ని మంత్రులు జోగు రామ‌న్, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని 26 వేల ఇళ్ళ‌కు మిష‌న్ భ‌గీర‌థ కింద మంచినీటి క‌నెక్ష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని మంత్రి జోగు రామ‌న్న అధికారుల‌కు సూచించారు. ఈ సమీక్షా స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్ కుమార్‌, ఎమ్మెల్యేలు దివాక‌ర్‌రావు, కోనేరు కోన‌ప్ప‌, బాపురావు రాథోడ్‌, దుర్గం చిన్న‌య్య‌, గ‌డ్డం విఠ‌ల్‌రెడ్డి, కోవా లక్ష్మీ, రేఖా నాయ‌క్‌, మిష‌న్ భ‌గీర‌థ ఈఎన్‌సీ సురేంద‌ర్‌రెడ్డి, సీఈ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ప‌బ్లిక్ వ‌ర్క్స్ ఈఎన్‌సీ ద‌న్‌సింగ్‌, జిల్లాలోని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ప‌లువురు ఇంజనీర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20379
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author