కుట్రపూరితంగానే రద్దు : కోమటిరెడ్డి

కుట్రపూరితంగానే రద్దు : కోమటిరెడ్డి
March 21 16:17 2018

హైదరాబాద్,
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వం కుట్ర పూరితంగానే తమ శాసన సభ్యత్వాలను రద్దు చేసిందని ఆరోపించారు. .దీని పై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బుధవారం నాడు అయన సంపత్ కుమార్ తో కలసి ఢిల్లీ కి బయలు దేరి వెళ్ళారు.ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం లో మీడియా తో మాట్లాడిన కోమటి రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చర్యలకు భయపడేది లేదని అన్నారు. బుధవారం ఎన్నికల సంఘం, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు సోనియాగాంధీ ని సైతం కలిసి అసెంబ్లీ పరిణామాలపై వివరిస్తామని చెప్పారు. గజ్వేల్ లో తాను పోటీ చేస్తా అన్నందుకే తనకు గన్ మెన్లను ఉపసంహరించారని ఆరోపించారు. మరోవైపు సంపత్ కుమార్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .సభ్యత్వాల రద్దు పై న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20393
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author