షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ లో నో పార్కింగ్ ఫీజు

షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ లో నో పార్కింగ్ ఫీజు
March 21 16:32 2018

హైదరాబాద్,
రాష్ట్రంలోని పట్టణప్రాంతాల వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో పార్కింగ్ ఫీజులపై స్పష్టతనిచ్చింది. ఇకపై మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దంటూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ జీవో విడుదల చేసారు. ఇందులో కొన్ని నిబంధనలు విధించారు. మొదటి అరగంట వరకు పార్కింగ్ ఫీజు ఉచితం. అరగంట నుంచి గంటలోపు ఉంటే షాపింగ్ బిల్ చూపిస్తే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మల్టీ ప్లెక్స్ లో గానీ, మాల్స్ లో గానీ గంట కంటే ఎక్కువ సేపు ఉంటే.. పార్కింగ్ ఫీజుకంటే ఎక్కువ చెల్లించిన షాపింగ్ బిల్స్ చూపించాలి. అప్పుడు కూడా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తంగా షాపింగ్ బిల్స్ చూపించి, పార్కింగ్ ఫీజు నుంచి బయటపడొచ్చు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిబంధనలు జీహెచ్ ఎంసీ తో పాటు అన్ని అర్భన్ ఏరియాలకూ వర్తిస్తాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20403
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author