వ‌డ్డీ మాఫీలేదు…ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించండి

వ‌డ్డీ మాఫీలేదు…ఆస్తిప‌న్నును వెంట‌నే చెల్లించండి
March 21 16:49 2018

హైదరాబాద్
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్ను బ‌కాయిల‌కు వ‌డ్డీ మిన‌హాయింపు లేనందున వెంట‌నే ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని న‌గ‌ర వాసుల‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నేటి వ‌ర‌కు రూ. 1,080కోట్ల ఆస్తిప‌న్ను వ‌సూలు అయ్యాయ‌ని వెల్ల‌డించారు. ఆస్తిప‌న్నును స‌మీపంలోని సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు, మీ-సేవా, ఇ-సేవా కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల‌లోనూ చెల్లించ‌వ‌చ్చున‌ని పేర్కొన్నారు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్‌ల ద్వారా ఆస్తిప‌న్ను చెల్లించేవారికి ట్రాన్స‌క్ష‌న్ చార్జీల‌ను కూడా మిన‌హాయింపు ఉంద‌ని పేర్కొన్నారు. ఆస్తిప‌న్ను బ‌కాయిల చెల్లింపుల‌కు అంద‌జేసే చెక్కులు బౌన్స్ అయితే త‌గు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు పేర్కొన్నారు. న‌గ‌రంలో నాలాల పూడిక‌కు సంబంధించి దాదాపు 80శాతం ప‌నుల‌కు టెండ‌రింగ్ ప్ర‌క్రియ పూర్తి అయ్యింద‌ని తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో జీహెచ్ఎంసీ ద్వారా చేప‌ట్టిన ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో ఈ సంవ‌త్స‌రాంతం వ‌ర‌కు 50శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంద‌ని, వ‌చ్చే మార్చి మాసాంతంలోగా వంద శాతం ఇళ్లు పూర్తి అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నందున దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పోలిస్తే హైద‌రాబాద్ న‌గ‌రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగంలో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి ఉంద‌ని క‌మిష‌న‌ర్ అన్నారు. న‌గ‌రంలో ప్రైవేట్ ఖాళీ స్థ‌లాల్లో చెత్త‌ను వేయ‌డం ద్వారా అనేక స‌మ‌స్‌ఉలు త‌లెత్తుతున్నాయ‌ని, వీటి విష‌యంలో ఏప్రిల్ మాసంలో ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. న‌గ‌రంలో ఉన్న ఖాళీ స్థ‌లాల్లో పెద్ద మొత్తంలో చెత్త‌ను వేయ‌డం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారి దోమ‌ల ఉత్ప‌త్తికి కేంద్రాలుగా మారాయని, ఈ ఖాళీ స్థ‌లాలో వేసే డంపింగ్ పై అనేక మంది జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఖాళీ స్థ‌లాలు ప్రైవేట్ వ్య‌క్తుల‌కు చెందిన‌వి అయితే ఆ స్థ‌లం యజ‌మానుల‌కు పొరుగువారితో క‌లిసి గుర్తించాల‌ని అన్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థ‌లాల్లో తిరిగి చెత్త వేయ‌కుండా బోర్డుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం, ఖాళీ స్థ‌లాల ఇంటి య‌జ‌మానుల‌తో ప్ర‌హరీగోడ‌ల‌ను నిర్మించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టి తిరిగి ఎవ్వ‌రు కూడా చెత్త‌ను వేయ‌కుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. గుర్తించిన‌ ఖాళీ స్థ‌లాల‌కు జ‌వాన్‌ లేదా ఎస్‌.ఎఫ్‌.ఏ లేదా ఇత‌ర కార్మికుడిని ఇన్‌చార్జిగా నియ‌మించి ఎవ్వ‌రూ కూడా చెత్త వేయ‌కుండా నిరోధించనున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా ఖాళీ స్థ‌లాల్లో చెత్త వేయ‌డం వ‌ల్ల అధికంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొనే వారిని గుర్తించి వారినే స్వ‌చ్ఛ రాయ‌బారిగా నియ‌మించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ ఖాళీ స్థ‌లాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేలా సంబంధిత స్థ‌లాల య‌జ‌మానుల‌తో మాట్లాడ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ వివ‌రించారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20411
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author