సాధికార మిత్రలపై నమ్మకం : చంద్రబాబు

సాధికార మిత్రలపై నమ్మకం : చంద్రబాబు
March 21 20:35 2018

అమరావతి,
ఉండవల్లిలోని గ్రీవిఎన్స్ హాల్ లో సాధికారత మిత్రాలతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, సాధికార మిత్రలు పాల్గోన్నారు. జిల్లాలలోని మండల కేంద్రాల నుండి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సాధికార మిత్రలు, వెలుగు, మెప్మా సిబ్బంది, మండల అధికారులు కుడా పల్గోన్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ని ప్రతి గ్రామంలో సాధికారిక మిత్రాల పనితీరు సత్పలితాలు ఇస్తాయని నమ్మకం కలుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఆస్తి మీరు. 35 కుటుంబాలకు ఒక సాధికారిక మిత్రాలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో4 లక్షల70 వేల మంది సాధికారిక మిత్రాలు పనిచేస్తున్నారు. వ్యక్తులు గా ఉంటే ఒక పరిధికి మాత్రమే లోబడి ఉంటాం, అదే ఒక సాంఘటిత శక్తిగా ఉంటే అద్భుతాలు సృష్టించబడతాయి. రాష్ట్రంలో 90 లక్షల మంది ఒక సంఘీటిత శక్తిగా రూపుదిద్దుకుంటారని సాధికారిక మిత్రాలకు నాంది పలికించండం జరిగిందని అన్నారు.
తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మద్రాస్ నుంచి విడిపోయి కర్నూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం అభివృద్ధి చెందింది. 60 సంవత్సరాలు హైదరాబాద్ ను అభివృద్ధి చెయ్యడం జరిగింది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసింది నేను. రాష్ట్రాన్ని అసంబద్దంగా విభజన చేశారు. రాష్ట్రం కోసం మాత్రమే ఇతరుల తో కలిసి ముందుకు వెళ్లడం జరిగిన మీకు తెలుసు. ప్రజల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాము. కేంద్రం సహకరించినా లేక పోయినా అక్కా చెల్లెళ్ళు ఉన్నారని నమ్మకం తో ముందుకు వెళ్ళాము. రూ.10 వేల కోట్ల తో అక్కా చెల్లెళ్ళ కోసం నిధులు మంజూరు చేసిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న కోర్కెలు గొంతెమ్మ కోరికలు కాదు. చట్టంలో పెట్టిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాము. రాష్ట్రంలో అధికంగా అభివృద్ధి సాదించగలుగుతున్నాము. రాష్ట్రం అభివృద్ధి కావడం కోసం మరిన్ని గంటలు పనిచేయడానికి నేను సిద్ధం. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్ని త్యాగాలు చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
అక్షరాస్యత కార్యక్రమానికి నాంది పలికింది మన రాష్ట్రమే. జీవితం అనేది నిరంతర ప్రక్రియ. నేను నిత్య విద్యార్థిని. నేర్చుకోవాల్సింది ఎక్కడ ఉన్నా ఎవరి వద్ద ఉన్నా నేర్చుకోవడం కోసం నేను ఎప్పుడూ పనిచేయడానికి వెనుకడుగు వెయ్యనని స్పష్టం చేసారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20415
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author