బీజేపీతో పొత్తు పెట్టుకోం,మద్దతివ్వం: పళనిస్వామి

బీజేపీతో పొత్తు పెట్టుకోం,మద్దతివ్వం: పళనిస్వామి
March 21 20:52 2018

న్యూఢిల్లీ
కావేరీ మేనేజిమెంట్ బోర్డ్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే మెతకవైఖరి చూపుతోందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళని స్వామి స్పందించారు.బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ మద్దతివ్వడం కానీ జరగదని పళిస్వామి స్పష్టం చేసారు.ఈ మేరకు బుధవారంనాడు అసెంబ్లీలో ఆయన ప్రకటన చేశారు. కావేరీ బోర్డు వాటర్ మానిటరింగ్ కమిటీ వేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈనెల15న రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ అంశంపై చర్చకు అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంటులో నిరసనలు చేస్తున్నారు. ఆరువారాల్లోగా సీఎంబీ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గత ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ జలాల్లో తమిళనాడు వాటాను తగ్గిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీర్పునివ్వడంపై ఆ రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=20427
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author